50 లక్షల గూగుల్ పాస్‌వర్డ్‌లు హ్యాక్?

Posted By:

సమాచారం సాంకేతికత రోజురోజుకు కొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నప్పటికి డాటా ప్రైవసీకి మాత్రం తూట్లు పడుతూనే ఉన్నాయి. వ్యక్తిగత ఆన్‌లైన్ డాటాను హ్యాకర్లు దొంగిలిస్తూనే ఉన్నారు. తాజాగా గూగుల్ అకౌంట్స్‌కు చెందిన దాదాపు 50 లక్షల యూజర్ నేమలతో పాటు పాస్‌‌వర్డ్‌లను హ్యాకర్లు దొంగిలించినట్లు వెబ్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

50 లక్షల గూగుల్ పాస్‌వర్డ్‌లు హ్యాక్?

మొత్తం 49.3 లక్షల అకౌంట్‌లకు సంబంధించి యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లతో కూడిన డాటాను మంగళవారం రష్యాకు చెందిన ఆన్‌లైన్ ఫోరమ్ బిట్‌కాయిన్ సెక్యూరిటీ‌లో (btcsec.com) పోస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీవీస్కిట్ అనే యూజర్ నేమ్‌తో ఈ డేటా బిట్‌కాయిన్ ఫోరమ్‌లో అప్‌లోడ్ అయినట్లు సమాచారం. హ్యాకింగ్‌కు గురైన అకౌంట్లలో 60 శాతం అకౌంట్లను ఇప్పుడికి వాడుతున్నారని సదరు డేటాను పోస్ట్ చేసిన యూజర్ చెప్పటం ఉత్కంఠకు దారితీస్తోంది. అయితే, ఈ వార్తలను గూగుల్ కొట్టిపారేస్తోంది.

తమ కంపెనీ నుంచి వివరాలు అంత సులువుగా లీకయ్యే అవకాశం లేదని చెబుతోంది. ఏదేమైనప్పటికి హ్యాకింగ్ ముప్పునుంచి బయటపడేందుకు ఆన్‌లైన్ యూజర్లు తరచూ పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot