ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2012!!

Posted By: Prashanth

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2012!!

 

కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న ‘ఎన్ఈసీ’ ఓ సరికొత్త ట్లాబెట్ కంప్యూటర్ ను అంతర్జాతీయ విపణిలో లాంఛ్ చేయునుంది. ‘ఎన్-06డి ఎల్టీఈ’ పేరుతో డిజైన్ కాబడిన ఈ డివైజ్ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. టాబ్లెట్ డిస్ ప్లే 7 అంగుళాల పరిమాణాన్ని కలిగి మల్టీ టచ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన 1.92 మెగా పిక్సల్ వెబ్ క్యామ్ ఉత్తమ క్వాలిటీ రిసల్యూషన్ ను కలిగి ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు తోడ్పడుతుంది. ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై పీసీ రన్ అవుతుంది.

 ఇతర ఫీచర్లు:

* శక్తివంతమైన 1200 MHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఏపీక్యూ8060 ప్రాసెసర్,

* 1024ఎంబీ సామర్ధ్యం గల LPDDR2 SDRAM,

* వై-ఫై (802.11 b/g/n),

* ఇన్‌బుల్ట్ జీపీఎస్,

* హెచ్‌డిఎమ్ఐ పోర్టు,

* బ్లూటూత్,

* యూఎస్బీ (2.0 వర్షన్),

* మైక్రో ఫోన్, లౌడ్ స్పీకర్, ఆడియో జాక్,

* 3610 mAh లతియమ్ ఐ-యాన్ బ్యాటరీ,

* ఎస్ఆర్ఎస్ సౌండ్ టెక్నాలజీ.

* ఆండ్రాయిడ్ మార్కెట్లోకి ప్రవేశించే వెసలబాటు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot