తానేంటో ప్రూవ్ చేసుకుంటున్న ‘అసస్’..?

Posted By: Super

తానేంటో ప్రూవ్ చేసుకుంటున్న ‘అసస్’..?

 

‘X’ సిరీస్‌లో ల్యాప్‌టాప్‌లను విడుదల చేస్తూ తానేంటో నిరూపించుకున్న ‘అసస్’ మరో సారి విజృంభించేందుకు X53SC వేరియంట్  వేగవంతమైన పనితీరు కనబర్చే ల్యాపీని ప్రవేశపెట్టనుంది. వనీలా డిజైన్‌తో సాధారణ లుక్‌లో కనిపించే ఈ కంప్యూంటింగ్ గ్యాడ్జెట్ పని విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది.

అసస్ X53SC ముఖ్య ఫీచర్లు:

* కోర్ i7 2.2 GHz ఇంటెల్ కోర్ ప్రాసెసర్, * 4జీబి ర్యామ్, * టర్బో బూస్ట్, * న్విడియా జీఫోర్స్ పవరఫుల్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, * 750జీబి హార్డ్ డ్రైవ్, * 15.6 అంగుళాల స్లీక్ డిస్‌ప్లే, * సౌకర్యవంతమైన కీబోర్డ్, * ల్యాపీ వేడిని నియంత్రించేందకు అసస్ ఐస్ కూల్ టెక్నాలజీ, * జిగాబిట్ ఇతర్ నెట్ పోర్ట్, * హెచ్డీఎమ్ఐ విడీయో అవుట్ పుట్, * యూఎస్బీ 3.0, 2.0 పోర్ట్స్, * డివీడీ రైటర్

2 కిలోల పై చిలుకు బరువు కలిగిన ఈ డివైజ్ పూర్తి స్థాయి వినోదపు అవసరాలకు దోహదపడుతుంది. పొందుపరిచిన 2.2 GHz ఇంటెల్ కోర్ i7 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ అదేవిధంగా 4జీబి ర్యామ్ వ్యవస్థలు పనులను వేగవంతంగా చక్కదిద్దుతాయి. నిక్షిప్తం చేసిన టర్బో బూస్ట్ వ్యవస్థ ప్రాసెసర్ క్లాక్ స్పీడ్‌ను 3.1GHzకు పెంచుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot