ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ!

Posted By: Prashanth

ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ!

 

ఎలక్ట్రానిక్స్ విభాగంలోకి తాజాగా ఆరంగ్రేటం చేసిన ఐస్ ఎక్స్‌ట్రీమ్ ఎలక్ట్రానిక్స్ (ICE X Electronics) తన తొలి ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ కంప్యూటర్ ‘ఐస్ ఎక్స్‌ట్రీమ్ 7’ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైజ్ రన్ అవుతుంది. స్ర్కీన్ పరిమాణం 7 అంగుళాలు. గ్యాడ్జెట్ పనివేగాన్ని మరింత రెట్టింపు చేసే క్రమంలో శక్తివంతమైన 1గిగాహెట్జ్ ప్రాసెసర్‌తో పాటు 1జీబి డీడీఆర్3 ర్యామ్‌ను నిక్షిప్తం చేశారు. 7 అంగుళాల స్ర్కీన్ 5 టచ్ ఇన్‌పుట్‌ను సపోర్ట్ చేస్తుంది. స్ర్కీన్ రిసల్యూషన్ 800 X 480పిక్సల్స్. వీడియోలను హైడెఫినిషన్ శ్రేణిలో తిలకించవచ్చు. 3కంటెంట్‌ను డివైజ్ సపోర్ట్ చేస్తుంది. హెచ్‌డిఎమ్ఐ పోర్ట్ సాయంతో టాబ్లెట్‌ను హైడెఫినిషన్ టీవీలకు జత చేసుకోవచ్చు.

అదనపు స్పెసిఫికేషన్‌లు:

టాబ్లెట్‌లో అమర్చిన 2 మెగా పిక్సల్ కెమెరా యావరేజ్ పనితీరును కనబరుస్తుంది. ఇన్‌బుల్ట్ మెమరీ 16జీబి, మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ సౌలభ్యతతో మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు. ఏర్పాటు చేసిన మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ మన్నికైన గ్రాఫిక్ అనుభూతులను చేరువచేస్తుంది. ఎక్సటర్నల్ డాంగిల్ సహకారంతో 3జీ కనెక్టువిటీని ఆస్వాదించవచ్చు. ఏర్పాటు చేసిన 4700ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఆశాజనకమైన బ్యాకప్ నిస్తుంది. బరువు 375 గ్రాములు. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో డివైజ్ లభ్యం కానుంది. 100కు పైగా అప్లికేషన్‌లను పీసీలో లోడ్ చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot