టాబ్లెట్ కంప్యూటర్‌ను కొనాలనుకుంటున్నారా..?

Posted By: Prashanth

టాబ్లెట్ కంప్యూటర్‌ను కొనాలనుకుంటున్నారా..?

 

టాబ్లెట్ కంప్యూటర్‌ను ఎంపిక చేసుకునే ముందు ఏ విధమైన అవసరాల కోసం కోనుగోలు చేస్తున్నామో అన్న అంశం పై ఖచ్చితమైన స్పష్టత ఉండాలి. ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత సంబంధిత డివైజ్‌ను మాత్రమే ఎంచుకోవాలి. ఇటీవల విడుదలైన పలు టాబ్లెట్ కంప్యూటర్లు వివిధ రంగాలకు ఉపయోపడే విధంగా ప్రత్యేకంగా డిజైన్ కాబడ్డాయి. నిరంతరాయంగా రోజంతా వినోదాన్ని పంచే ‘ఫ్రెండ్టీ మీడియా టాబ్లెట్ పీసీ’ని ఆర్చోస్ (Archos) సంస్ధ డిజైన్ చేసింది. ‘ఆర్చోస్ 101 G9 టర్బో’ వర్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ పనితీరు అదే విధంగా ఫీచర్లు:

* గుగూల్ ఆండ్రాయిడ్ 3.2.1 ఆపరేటింగ్ సిస్టం,

* OMAP 4460 ప్రాసెసర్, క్లాక్ స్పీడ్ 1500 MHz

* సిస్టం మెమరీ 250 జీబి,

పనితీరు:

టాబ్లెట్ డిస్‌ప్లే పరిమాణం 10.1 అంగుళాలు, మల్టీ టచ్ స్వభావం కలిగి ఉంటుంది. ఈ సౌలభ్యతతో డివైజ్‌ను సులువుగా ఆపరేట్ చేసుకోవచ్చు. టాబ్లెట్ ప్రధాన కెమెరా సామర్ధ్యం 0.9 మెగా పిక్సల్స్. నిక్షిప్తం చేసిన వైర్‌లెస్ ల్యాన్ అదే విధంగా జీపీఎస్ వ్యవస్థలు నెట్ బ్రౌజింగ్ ప్రక్రియ వేగాన్ని పెంచుతాయి. బ్లూటూత్ 2.1, యూఎస్బీ వర్షన్ 2.0 అప్లికేషన్లను టాబ్లెట్ కనెక్టువిటీ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తాయి. డివైజ్ బరువు 755 గ్రాములు, ప్రయాణ సందర్భాల్లో సైతం సులువుగా క్యారీ చేయ్యవచ్చు.

ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఈ డివైజ్‌లో మ్యూజిక్ ప్లేయర్‌కు బదులుగా ఆండ్రాయిడ్ ఆడియో ప్లేయర్‌ను ఏర్పాటు చేశారు. ఈ అప్లికేషన్ మీ వినోదపు అవసరాలను తీర్చటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తుంది. పొందుపరిచిన వీడియో టూల్ నాణ్యమైన వీడియో అనుభూతిని మీకు కలిగిస్తుంది. సినిమాలు అదే విధంగా ఆటలను రెట్టింపు అనుభూతితో ఆస్వాదించవచ్చు. వచ్చే ఏడాది ప్రధమాంకం లభ్యం కానున్న ‘ఆర్చోస్ 101 G9 టర్బో టాబ్లెట్’ ధర సమంజసంగానే ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot