ఇప్పడు ఐపాడ్ కాదు గురూ..!! హెచ్ డీ ఐపాడ్..!!

Posted By: Staff

ఇప్పడు ఐపాడ్ కాదు గురూ..!! హెచ్ డీ ఐపాడ్..!!

‘ఐపాడ్’‌ను ప్రవేశపెట్టి కంప్యూటింగ్ రంగంలో నూతన ఒరవడులకు నాంది పలికన ‘ఆపిల్’ మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హైపర్ డెఫినిషన్ (హెచ్ డీ) వంటి నూతన పరిజ్ఞానంతో కూడిన టాబ్లెట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రచురణ సంస్థల్లో విధులు నిర్వహించే నిపుణులకు వృత్తి రిత్యా ఈ సరికొత్త టాబ్లెట్ ‘iPad HD’ మరింత దోహదపడుతుందని పలు వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరో రెండు నెలల్లో మార్కెట్‌లోకి రానున్న ఈ సరి కొత్త మోడల్ ‘iPad HD’ ఫ్రెంట్, బ్యాక్ కెమెరాలను కలిగి ఉండటంతో పాటు హై డెఫినిషన్ వీడియో వంటి ఆధునిక ప్రమాణాలను కలిగి ఉంటుంది. అంతేకాదండోయ్... ఫ్రంట్ కెమెరా సాయంతో వీడియో కాలింగ్ చేసుకోవచ్చు.. అది కూడా అత్యుత్తమ నాణ్యతతో, 3జీ నెట్ వర్క్‌ను సపోర్టు చేసే వెసలబాటు ‘iPad HD’కి ఉండటంతో సహజసిద్ధమైన అనుభూతిని మీరు పొందగలుగుతారు.

9.8 అంగుళాల పొడవుతో, 9.8 అంగుళాల డిస్‌ప్లే సామర్థ్యం కలిగి ఉన్న ‘iPad HD’ టచ్ స్ర్కీన్ స్వభావం కలిగి ఉంటుంది. అంతేకాకుండా శక్తివంతమైన iOS 5 వ్యవస్థతో ఈ టాబ్లెట్‌ను మరింత సమర్ధవంతంగా రూపొందిస్తున్నారు. మల్టీ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలకు సంబంధించి ప్లే బ్యాక్, రికార్డింగ్ వంటి అంశాలను MP3, MP4, WAV, WMV, AAC+ హై డెఫినిషన్ ఫార్మాట్లలో మీకు అందిస్తుంది. టాబ్లెట్‌ను ఇతర పరికరాలకు జత చేసుకునేందుకు HDMI port, USB slots వంటి ఆప్షన్లను పొందుపరిచారు.

ఈ టాబ్లెట్‌లో పొందుపరిచిన iOS వ్యవస్థ ఫోటోలను, వీడియోలను ఎడిట్ చేయటంలో ఉత్తమ పనితీరును ప్రదర్శిస్తుంది. ప్రత్యేకాంశాలైన వై - ఫై, 3G high speed నెటవర్క్‌లు వెబ్ బ్రౌజింగ్ విషయంలో డౌన్ లోడ్ వేగాన్ని మరింత పెంచుతాయి. రెండు నెలల్లో మార్కెట్లో విడుదల కాబోయే ‘iPad HD’ కు సంబంధించి ధర విషయం మాత్రం సస్పెన్సె..

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting