కొత్త ఐప్యాడ్.. 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చెయ్యదు!

Posted By: Super

 కొత్త ఐప్యాడ్.. 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చెయ్యదు!

 

కొత్ వర్షన్ ఐప్యాడ్ ఈ నెల 27 నుంచి దేశంలోని అన్ని ప్రముఖ గ్యాడ్జెట్ స్టోర్‌లలో లభ్యం కానుంది. ఆపిల్ నుంచి వస్తున్న ఈ మూడవ జనరేషన్ టాబ్లెట్ వై-ఫై, వై-ఫై+4జీ  వేరియంట్‌లలో రూపుదిద్దుకుంది. ఈ కొత్త గ్యాడ్జెట్‌ను కొనదలచుకున్న వారు ఎంపిక పై నిర్థిష్టమైన అవగాహనను కలిగి ఉండటం మంచిది.

దేశంలో ఇటీవలే 4జీ సేవలు ప్రారంభమయ్యాయి. భారతి ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ నెట్‌వర్క్ ప్రస్తుతానికి కోల్‌కతాకు మాత్రమే పరిమితమైంది. 3జీతో పోలిస్తే 10రెట్లు వేగవంతంగా స్పందించే ఈ హైస్పీడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను త్వరలో బెంగుళూరు, చండీగఢ్ ఇంకా పూనే ప్రాంతాలకు విస్తరించనున్నారు. 4జీ నెట్‌వర్క్‌కు సంబంధించి దేశంలో వినియోగిస్తున్న విభిన్న స్పెక్ట్రమ్, ఐప్యాడ్ ( వై-ఫై+ 4జీ) వేరియంట్‌ను సపోర్ట్ చేయ్యదని  నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణంలోకి తీసుకుంటే కొత్త ఐప్యాడ్ కొనదలిచిన వారికి వై-ఫై వేరియంట్ ఉత్తమమైన ఎంపిక.

కొత్త ఐప్యాడ్ (వై-ఫై వేరియంట్) ధరలు:

16జీబి- రూ.30,500,

32జీబి – రూ.36,500,

64జీబి – రూ.42,500.

కొత్త ఐప్యాడ్ (వై-ఫై+ 4జీ వేరియంట్) ధరలు:

16జీబి- రూ.38,900,

32జీబి – రూ.44,900,

64జీబి – రూ.50,900.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot