రిలయన్స్ జాక్‌పాట్!!

టెక్నాలజీ ప్రియులను ఎంతగానో మైమరుపుకు లోనుచేుస్తున్న ఆపిల్ ఐప్యాడ్ 3 నేటి నుంచి భారతీయ విపణిలో లభ్యం కానుంది. దేశ వ్యాప్తంగా 26 రిలయన్స్ డిజిటల్ రిటైల్ అవుట్‌లెట్లలో వీటిని విక్రయించనున్నారు. ఆపిల్ ఇప్పటి వరకు రూపొందంచిన టాబ్లెట్ కంప్యూటర్లలో ఐప్యాడ్ 3 మరింత ఆధునీకతను సంతరించుకుంది. ఈ కొత్త టాబ్లెట్ వై-ఫై, వై-ఫై+4జీ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. ఐప్యాడ్ -2కు అప్‌డేటెడ్ వర్షన్‌గా మార్చి 7న మార్కెట్లో లాంఛ్ అయిన ఐప్యాడ్ 3, ఈ నెల 27 నుంచి భారత్‌లో లభ్యమవుతుందని ఇదువరుకే ప్రకటించారు.
రెండు వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఐప్యాడ్ 3 ధరల వివరాలు క్లుప్తంగా:
వై-ఫై వేరియంట్.. 16జీబి- రూ.30,500, 32జీబి – రూ.36,500, 64జీబి – రూ.42,500.
వై-ఫై+ 4జీ వేరియంట్.. 16జీబి- రూ.38,900, 32జీబి – రూ.44,900, 64జీబి – రూ.50,900.
ఇండియాతో పాటు కొలంబియా, ఎస్టోనియా, ఇస్రేల్, లాట్వియా, లిథువేనియా, మోంటెనెగ్రో, దక్షిణాఫ్రికా, థాయిలాండ్ దేశాల్లో కొత్త ఐప్యాడ్ లాంఛ్ అవుతుంది. మరో 12 దేశాల్లో ఈ నెల 20నే కొత్త ఐప్యాడ్‌ను ప్రవేశపెట్టారు. దింతో ఆపిల్ కొత్త ఐప్యాడ్ లభ్యమయ్యే దేశాల సంఖ్య 55కు చేరుకుంటుంది.
ఆపిల్ కొత్త ఐప్యాడ్ ప్రధాన ఫీచర్లు:
రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 2048×1536పిక్సల్స్),
డ్యూయల్ కోర్ ఆపిల్ ఏ5X ప్రాసెసర్,
క్వాడ్‌కోర్ గ్రాఫిక్ యూనిట్,
5 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా,
10 గంటల బ్యాటరీ లైఫ్.


Click it and Unblock the Notifications