నిరూపించుకునేందుకు మళ్లి వస్తున్నా..!!

Posted By: Super

నిరూపించుకునేందుకు మళ్లి వస్తున్నా..!!

మార్కెట్లో విశ్వసనీయ బ్రాండ్‌గా ముద్రపడిన ‘డెల్’ తానేంటో నిరూపించుకునేందుకు మరో సారి సిద్ధమవుతుంది. తన సరికొత్త ‘ల్యాప్‌టాప్ డెల్ వోస్ట్రో 131’ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 13.3 అంగుళాల స్క్రీన్ కలిగిన ‘వోస్ట్రో 131’ 1366 X 768 రిసల్యూషన్‌తో హై డెఫినిషన్ ఎల్‌ఇడి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. బ్రిడ్జి కోర్ i3, i5 ప్రొసెసర్ ఆప్షన్లను ఈ ల్యాప్‌టాప్‌లో పొందుపరిచారు. ఆకట్టకునే గ్రాఫిక్ పనితీరు, ఎక్సట్రా లాంగ్ లైఫ్ కలిగిన బ్యాటరీ (9.5 గంటలు) వినియోగదారునికి లబ్థి చేకూర్చే అంశాలు.

డివైజ్‌లో పొందుపరిచిన ఇంటెల్ హైపర్ బారిక్ కూలింగ్ టెక్నాలజి, ఓవర్ హీట్ నుంచి కాపాడుతుంది. డిజిటల్ మైక్రోఫోన్లను ఈ ల్యాప్‌టాప్‌లో పొందుపరిచారు. విండోస్ 7 హోమ్ ప్రీమియం వ్యవస్థను ముందుగానే పొందుపరిచారు. ఇక కీ బోర్డు విషయానికి వస్తే ఆప్షనల్ బ్యాక్ లిట్ కీబోర్డు విధానం కలిగి ఉంటుంది.

అనుసంధానించిన ఇంటెల్ కోర్ i3-2310m ప్రొసెసింగ్ వ్యవస్థ డివైజ్ పనితీరును ఎప్పటి కప్పుడు మెరుగుపరుస్తుంది. సామర్థ్యం కలిగిన ప్రొసెసర్ గ్రాఫిక్ వ్యవస్థను మరింత వేగవంతంగా నడిపిస్తుంది. ‘వోస్ట్రో 131’ 4జీబీ ర్యామ్ సామర్థ్యంతో పాటు 320 జీబీ హార్డ్‌డిస్క్ మెమరీ కలిగి ఉంటుంది.

ఇక కనెక్టువిటీ విషయానికి వస్తే ఆధునాతన కనెక్టువిటీ ఆఫ్షన్లను పొందుపరిచారు. ఇంటెల్ సెన్‌ట్రినో వైర్ లెస్ - N 1030, బ్లూటూత్ వంటి ఆప్షన్లు డవైజ్‌ను మరింత సమర్థవంతంగా నడిపిస్తాయి. వేలి ముద్రలను గుర్తించే డిజిటల్ పర్సనో సాఫ్ట్ వేర్‌ను డివైజ్‌లో పొందుపరిచారు. ఇక బరువు విషయానికి వస్తే ల్యాప్‌టాప్ కేవలం 1.64 కేజీల బరువు ఉంటుంది. త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న ‘డెల్ వోస్ట్రో 131’ ధర రూ.30,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot