హెచ్‌పి సూపర్ కంప్యూటర్లు

Posted By: Prashanth

హెచ్‌పి సూపర్ కంప్యూటర్లు

 

హెచ్‌పి తన బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తిరించుకునేందుకు గాను మార్కెట్లోకి త్వరలో ఐదు కొత్త కంప్యూటర్ మోడల్స్‌ని విడుదల చేసేందుకు సిద్దమైంది. పర్సనల్ కంప్యూటర్స్ విభాగంలో విడుదలవుతున్న టచ్ స్మార్ట్ 610, టచ్ స్మార్ట్ 520 ఎక్కువ ధరతో వస్తున్నాయి. ఎంటర్టెన్మెంట్ కొసం ప్రత్యేకంగా హెచ్‌పి కంపెనీ అందిస్తున్న ఈ కంప్యూటర్లు ఇంటెల్ సెకండ్ జనరేషన్ ప్రాససెర్‌తో రన్ అవనున్నాయి.

ఈ కంప్యూటర్లకు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే డెస్కటాప్ పుల్ టచ్ స్క్రీన్‌తో ఉండడమే కాకుండా, కీబోర్డ్, మౌస్ కూడా ప్రత్యేకం. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ కొసం ప్రత్యేకంగా ఇందులో టచ్ స్మార్ట్ 5.0 సాప్ట్‌వేర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఆడియో క్వాలిటీ కూడా సూపర్బ్‌గా ఉంది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో టచ్‌స్మార్ట్ 520 కంప్యూటర్ ధర సుమారుగా రూ 60,000 ఉండగా, అదే టచ్ స్మార్ట్ ఫోన్ 610 ధర సుమారుగా రూ 72,000 వరకు ఉంటుందని నిపుణుల అంచనా.

మిగిలిన మూడు మోడల్స్ హెచ్‌పి ఓమ్ని 220, హెచ్‌పి ఓమ్ని 120, హెచ్‌పి డ్రీమ్ స్కీన్ 400. హెచ్‌పి ఓమ్ని 220, హెచ్‌పి ఓమ్ని 120 రెండు కంప్యూటర్స్ కూడా చూసేందుకు సింపుల్‌గా ఉంటాయి. వీటిని రూపొందించిన కలర్ స్కీమ్, మెటాలిక్ చూసేందుకు చక్కగా ఉంటాయి. ఈ రెండు కంప్యూటర్లు మెమరీ స్టోరేజి 1TB. ఓమ్మి 120 కంప్యూటర్ 20 ఇంచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. అదే ఓమ్మి 220 మాత్రం 21.5 ఇంచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది.

వీటిల్లో నిక్షిప్తం చేసిన స్పీకర్స్ పుల్ హెచ్‌డి డిస్ ప్లేని అందిస్తాయి. ఇందులో నిక్షిప్తం చేసిన లింక్‌అప్ టెక్నాలజీ యూజర్స్‌ని నోట్‌బుక్ పిసి నుండి కంటెంట్‌ని చూసేందుకు వీలు కల్పించడం జరిగింది. ఇండియన్ మార్కెట్లో హెచ్‌పి ఓమ్మి 220 ధర సుమారు 51,000కాగా, హెచ్‌పి ఓమ్మి120 ధర సుమారు 28,000గా నిర్ణయించడమైంది.

చివరగా హెచ్‌పి డ్రీమ్ స్క్రీన్ 400 ప్రత్యేకతలను గమనించినట్లేతే దీని బరువు 108 గ్రాములు. యూజర్స్ ఈ కంప్యూటర్‌లో రెండు ఆపరేటింగ్ సిస్టమ్ లను బూట్ చేసుకునేందుకు గాను డ్యూయల్ బూట్ ఫీచర్ ప్రత్యేకం. ఇండియన్ మార్కెట్లో హెచ్‌పి డ్రీమ్ స్క్రీన్ 400 ధర రూ 22,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot