అమెరికన్ రిలయన్స్ ల్యాప్‌టాప్ మేళా..!!

Posted By: Staff

అమెరికన్ రిలయన్స్ ల్యాప్‌టాప్ మేళా..!!

 

హై క్వాలిటీ కంప్యూటర్స్ అదేవిధంగా ల్యాప్‌టాప్ పరికరాలను ఉత్పత్తి చేయ్యటంలో గ్రేడ్ వన్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘అమెరికెన్ రిలయన్స్’ (AMREL) తాజా ఆవిష్కరణలకు సంబంధించి సమాచారం బహిర్గితమైంది. పారిశ్రామిక, వైద్య, మిలటరీ రంగాల అవసరాలకు ఈ సంస్థ ఇప్పటికే అత్యాధునిక కంప్యూటింగ్ గ్యాడ్జెట్లను రూపొందించింది. తాజాగా (ROCKY) RT9, RK9, RF9 వర్షన్లలో పటిష్టమైన ల్యాపీ పరికరాలను AMREL విడుదల చేసింది.

Rocky RF9-1:

- డిస్‌ప్లే 17.1 అంగుళాలు, స్క్ర్రీన్ రిసల్యూషన్ 1440 x 990 పిక్సల్స్, ఇంటెల్ కోర్ 2 డ్యూయో ప్రాసెసింగ్ వ్యవస్థ, 320జీబీ సాటా హార్డ్ డ్రైవ్, LAN, WAN, GPS, Modem వంటి వైర్లెస్ వ్యవస్థలను ఈ ల్యాపీ సపోర్ట్ చేస్తుంది, 2GB DDR3 1066 MHz మెమరీ, 8జీబీ వృద్ధి చేసుకోవచ్చు, విండోస్ 7 ప్రొఫెషనల్ అపరేటింగ్ సిస్టం, (32 బిట్, 64 బిట్)

Rocky RK9-M:

డిస్‌ప్లే 15.1 అంగుళాలు, రిసల్యూషన్ 1400 x 1050 పిక్సల్స్, విండోస్ 7, లైనెక్స్‌లకు సహకరించే విధంగా ఆపరేటింగ్ సిస్టం, 2GB DDR3 1066 MHz మెమరీ సామర్ధ్యం, పటిష్టమైన 320 జీబీ SATA HDD హార్డ్ డ్రైవ్, SSHD వ్యవస్థ అదేవిధంగా సెకండరీ డ్రైవర్స్‌ను డివైజులో పొందుపరిచారు, పరిశ్రమల వారి కోసం నలుపు, సిల్వర్ రంగులో ఈ ల్యాపీ డిజైన్ కాబడింది, మిలటరీ వారి కోసం పచ్చ రంగులో ఈ ల్యాపి డిజైన్ కాబడింది, నాణ్యమైన కోబోర్డ్ మరియు టచ్ ప్యాడ్ సౌలభ్యత,

Rocky RT9-M ఫీచర్లు:

డిస్‌ప్లే 13.3 అంగుళాలు, రిసల్యూషన్ 1024 x 768 పిక్సల్స్, యాంటీ రీఫ్లెక్టివ్ TFT LCD టెక్నాలజీ, అప్‌గ్రేడ్ చేయబడిన డీవీడీ రోమ్, ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టం, హార్డ్ డ్రైవ్ సామర్ధ్యం తదితర అంశాలు RF9-1, RK9-M మాదిరిగానే ఉంటాయి. ఈ ల్యాపీల ధరలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot