టెన్షన్, టెన్షన్.. నెలకో ఘులక్!!

Posted By: Prashanth

టెన్షన్, టెన్షన్.. నెలకో ఘులక్!!

 

ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న శామ్‌సంగ్ దూకుడును మరింత పెంచింది. తన గెలక్సీ లైనప్‌కు మరిన్ని కొత్త ఉత్పత్తులను జోడించనుంది. రానున్న కొత్త వాటిలో టాబ్లెట్ పీసీలతో పాట స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. తాజాగా గెలక్సీ లైనప్ నుంచి మూడు కొత్త బ్రాండ్ పేర్లను శామ్‌సంగ్ వెల్లడించింది. పేర్లు గెలక్సీ ప్రీమియర్, గెలక్సీ గ్రాండ్, గెలక్సీ నెక్స్ట్. వీటిలో ఏది స్మార్ట్‌ఫోనో.. ఏది టాబ్లెట్ పీసీనో తెలియాల్సి ఉంది. గత నెలలో గెలక్సీ బీమ్ (ప్రొజెక్టర్ స్మార్ట్‌ఫోన్), గెలక్సీ నోట్ ( పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ ) బ్రాండ్ నేమ్‌లతో స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టి గెలక్సీ లైనప్‌ను శామ్‌సంగ్ మరింత బలోపేతం చేసింది. తాజా పరిమాణంతో గెలక్సీ సిరీస్ పరిధి మరింత విస్తరించాలని ఆశిద్దాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot