7 అంగుళాల టచ్ స్ర్కీ‌న్‌తో శ్యామ్‌సంగ్ గెలక్సీ టాబ్లెట్!!

Posted By: Prashanth

7 అంగుళాల టచ్ స్ర్కీ‌న్‌తో శ్యామ్‌సంగ్ గెలక్సీ టాబ్లెట్!!

 

ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన శ్యామ్‌సంగ్ గెలక్సీ టాబ్టెట్ పీసీ ప్రస్తుతం 8.9, 10.0 స్ర్కీన్ సైజల్లో లభ్యమవుతుంది. వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన నేపధ్యంలో గెలక్సీ టాబ్లెట్ పీసీని 7.0 వర్షన్‌లో విడుదల చేసేందుకు యాజమాన్యం ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ పీసీ ముఖ్య ఫీచర్లు:

ఏర్పాటు చేసిన 3జి సౌలభ్యత వేగవంతమైన నెట్ బ్రౌజింగ్‌కు దోహదపడుతుంది. 7 అంగుళాల LCD సామర్ధ్యపు టచ్ స్ర్కీన్ సౌకర్యవంతమైన కంప్యూటింగ్ అనుభూతిని కలిగిస్తుంది. 32జీబి ఇంటర్నెల్ మెమరీ మరింత ప్రయోజనకరంగా నిలుస్తుంది. మెమరీ సరిపోని పక్షంలో ఎక్సటర్నల్ స్లాట్ ద్వారా జీబిని 64కు వృద్ధి చేసుకోవచ్చు. 4000mAh సామర్ధ్యం గల స్టాండర్డ్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ వ్యవస్థ పటిష్ట బ్యాకప్ కలిగి ఉంటుంది. పొందుపరిచిన కెమెరా వ్యవస్థ హై పిక్సల్ స్వభావాన్ని కలిగి ఉంటుంది.

టాబ్లెట్ పీసీలోని వీడియోలను హై డెఫినిషన్ సౌలభ్యతతో తిలకించవచ్చు. పీసీలో నిక్షిప్తం చేసిన మల్టీమీడియా ప్లేయర్ వ్యవస్థ వినోదాన్ని నిరంతరాయంగా పంచుతుంది. బరువు 345 గ్రాములు సులువుగా ప్రయాణ సందర్భాల్లో క్యారీ చేయ్యవచ్చు. అన్నిరకాల కమ్యూనికేషన్ లావాదేవీలను ఈ డివైజ్ చక్కబెడుతుంది. త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న శ్యామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 7 ధర రూ.30,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot