3 సెకన్లలో పూర్తి సినిమా డౌన్‌లోడ్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ వై-ఫై టెక్నాలజీ విభాగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. తాజాగా ఈ సంస్థ వృద్థి చేసిన ‘60గిగాహెట్జ్ మిల్లీమీటర్ - వేవ్ బ్యాండ్ వై-ఫై టెక్నాలజీ' అన్ని పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొని టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త ఒరవడిని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.

సామ్‌సంగ్ రూపొందించిన 60 గిగాహెట్జ్ వై-ఫై టెక్నాలజీ ద్వారా 1జీబి డేటా కలిగిన సినిమాను కేవలం 3 సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వై-ఫై సాంకేతికతతో పోలిస్తే 5 రెట్ల వేగవంతంగా ఈ 60 గిగాహెట్జ్ వై-ఫై స్పందిస్తుంది. ఈ సాంకేతికత, సైద్ధాంతిక ఇంకా వాస్తవ వేగాల మధ్య దూరాన్ని తగ్గిస్తుందని సామ్‌సంగ్ వెల్లడించింది.
60 గిగాహెట్జ్ వై-ఫై టెక్నాలజీ సెకనుకు 575 మెగాబైట్‌ల డేటా ట్రాన్స్‌మిషన్ వేగాన్ని అందుకోగలదు. మార్కెట్లో వచ్చే ఏడాది నుంచి ఈ టెక్నాలజీ లభ్యమయ్యే అవకాశముంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








