‘2012’లో ఆ బ్రాండ్ దిశ మారనుందా..?

Posted By: Staff

‘2012’లో ఆ బ్రాండ్ దిశ మారనుందా..?

 

గ్లోబల్ కంపెనీ  సిస్కో (Cisco) టాబ్లెట్ పీసీల వ్యాపారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత ఆగష్టులో  7 అంగుళాల  ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీని ప్రవేశపెట్టిన ఉత్సాహంతో ఈ బ్రాండ్  న్యూ ఇయర్ ప్రభంజనానికి శ్రీకారం చుట్టింది. 2012లో సిస్కో  ప్రవేశపెట్టబోతున్న టాబ్లెట్ పీసీలు  ఆండ్రాయిడ్  లేటెస్ట్ వర్షన్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటంగ్ వ్యవస్థ పై రన్ అవుతాయని విశ్వసనీయ వర్గాలు ఉటంకించాయి. అత్యాధునిక సెక్యూరిటీ అప్లికేషన్లను డివైజ్ లో నిక్షిప్తం చేస్తున్నట్లు తెలియవచ్చింది.

అన్ని వర్గాలు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా యూజర్ ఫ్రెండ్లీ ఫ్లెక్సీబుల్ ఫీచర్లను ఈ గ్యాడ్జెట్లలో నిక్షిప్తం చేసినట్లు విశ్లేషణలు  పేర్కొంటున్నాయి. ఈ టాబ్లెట్ల  ధర ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు తెలియాల్సి ఉంది.  డిజిటెల్ ప్రపంచంలో రోజు రోజుకు చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పుల నేపధ్యంలో  సిస్కో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot