రివ్యూ అదిరింది.. నెక్సస్ 10 రిపేర్ మరింత సులువు!

By Super
|

రివ్యూ అదిరింది.. నెక్సస్ 10 రిపేర్ మరింత సులువు!


సామ్‌సంగ్ డిజైన్ చేసిన గూగుల్ బ్రాండెడ్ టాబ్లెట్ ‘నెక్సస్ 10’, ఎల్‌జీ డిజైన్ చేసిన మరో స్మార్ట్‌ఫోన్ ‘నెక్సస్ 4’ నవంబర్ 13 నుంచి పలు దేశాల్లో ఎంపిక చేసిన మార్కెట్లలో లభ్యమవుతున్న విషయం తెలిసిందే. ఎల్‌జీ రూపొందించిన ‘నెక్సస్ 4’ మరమ్మత్తు స్కోరుకు సంబంధించి ప్రముఖ రేపేరింగ్ సంస్థ ఐఫిక్సిట్ (iFixit) ‘7/10’ రేటింగ్‌ను విడుదల చేసింది. ఈ తాజా రేటింగ్‌తో నెక్సస్ 4 మరమ్మత్తు మరింత సులువని స్ఫష్టమవుతోంది. మరో రిపేర్ సంస్థ ‘పవర్‌బుక్ మీడిక్’

 

(Powerbook Medic) నెక్సస్ 10 రిపేరింగ్ ఐప్యాడ్‌తో పోలిస్తే మరింత సులవంటూ ఫోటో ఫీచర్‌తో కూడిన విశ్లేషణను విడుదల చేసింది. ‘నెక్సస్ 10’ రిపేరింగ్ ప్రక్రియకు సంబంధించి ఫోటో గ్యాలరీతో కూడిన విశ్లేషణను ఈ లింక్ అడ్రస్‌లో చూడొచ్చు.

సామ్‌సంగ్ నెక్సస్ 10 (samsung nexus 10):

బరువు ఇంకా చుట్టుకొలత: 263.8 x 177.8 x 8.9మిల్లీ మీటర్లు, బరువు 603 గ్రాములు,

డిస్‌ప్లే: 10.1 అంగుళాల డిస్‌ప్లే, రిసల్యూషన్ 1560 x 1600పిక్సల్స్, 330 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

ప్రాసెసర్: 1.7గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ15 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

మెమెరీ: 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ 16 ఇంకా 32జీబి,

కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

కనెక్టువిటీ: బ్లూటూత్, వై-ఫై, మైక్రో యూఎస్బీ, మైక్రో హెచ్‌డిఎమ్ఐ, డ్యూయల్ సైడ్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్+గ్లోనాస్ కనెక్టువిటీ ఫీచర్లు,

బ్యాటరీ: 9000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ(వీడియో ప్లేబ్యాక్ టైమ్ 9 గంటలు, స్టాండ్‌బై టైమ్ 500 గంటలు).

ఈ డివైజ్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎల్‌జి నెక్సస్ 4(Lg nexus 4):

బరువు ఇంకా చుట్టుకొలత: 134.2 x 68.6 x 9.1మిల్లీ మీటర్లు, బరువు 139 గ్రాములు.

డిస్‌ప్లే: 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్(జిరో గ్యాప్ టెక్నాలజీ)

ప్రాసెసర్: శక్తివంతమైన క్వాడ్ కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ ఎస్4 ప్రో ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

మెమరీ : 2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి,16జీబి,

కెమెరా: 8మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

కనెక్టువిటీ: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0,

బ్యాటరీ: 2100ఎమ్ఏహెచ్ లి-పో బ్యాటరీ, టాక్‌టైమ్ 15.3 గంటలు, స్టాండ్‌బై టైమ్ 390 గంటలు

ఇండియన్ మార్కెట్లో ఈ డివైజ్ కు సంబంధించిన ప్రీబుకింగ్ లను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ (Saholic) ఆహ్వానిస్తోంది.

Read in English

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X