గూగుల్ నెక్సస్7కు డాకింగ్ స్టేషన్!

Posted By: Staff

 గూగుల్ నెక్సస్7కు డాకింగ్ స్టేషన్!

 

అసూస్ డిజైన్ చేసిన గూగుల్ బ్రాండెడ్ టాబ్లెట్ ‘నెక్సస్ 7’ ఇండియన్ మార్కెట్లో నవంబర్ మొదటి వారం నుంచి లభ్యమవుతున్న విషయం తెలిసిందే. ధర రూ.19,999. హాట్ కేకులా అమ్ముడుపోతున్న ఈ టాబ్లెట్ పై ఓ ఆసక్తికర వార్తను అసూస్ జపాన్

వెబ్‌సైట్ బహిర్గతం చేసింది. నెక్సస్7కు సంబంధించి ప్రత్యేక డాకింగ్ స్టేషన్‌ను ఈ డిసెంబర్ మధ్య నాటికి అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ధర రూ.2,300. 3.5 ఎమ్ఎమ్ ఆడియో ఇంకా యూఎస్బీ పోర్ట్‌లను డాక్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిఉండటాన్ని పై చిత్రంలో చూడొచ్చు. బరువు 280 గ్రాములు, చుట్టుకొలత 65 x 65.1 x 219మిల్లీమీటర్లు.

గూగుల్ నెక్సస్ 7 ఫీచర్లు:

7 అంగుళాల 10 పాయింట్ మల్టీ-టచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్, క్వాడ్ కోర్ 1.2 ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి 1.2మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, 4325ఎమ్ఏహెచ్ బ్యాటరీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ కనెక్టువిటీ. ప్రత్యేకతలు: గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్స్, క్రోమ్ బ్రౌజర్.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot