గూగుల్ నెక్సస్ 7కు పోటీగా ఆమోజన్ కైండిల్ ఫైర్!

Posted By: Prashanth

గూగుల్ నెక్సస్ 7కు పోటీగా ఆమోజన్ కైండిల్ ఫైర్!

 

టాబ్లెట్ కంప్యూటర్‌ల సంగ్రామంలో భాగంగా గూగుల్, ఆమోజన్ కిండిల్ ఫైర్‌ల మధ్య పోటీ వాతావరణం నెలకుంది. గూగుల్ నిర్మాణ సారధ్యంలో అసస్ డిజైన్ చేసిన టాబ్లెట్ నెక్సస్ 7 జూలై 2102లో విడుదలై అమ్మకాల పరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఈ డివైజ్ 16జీబి వర్షన్ 2012 చివరినాటికి అమ్మకాల పరంగా 8 మిలియన్ల యూనిట్‌లను దాటే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నెక్సస్ 7కు పోటీగా ఆమోజన్ కైండిల్ ఫైర్ హైడెఫినిషన్ పేరుతో సరికొత్త టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. డ్యూయల్ యాంటీనా, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, అల్ట్రా ఫాస్ల్ డౌన్‌లోడ్స్, హైడెఫినిషన్ స్ట్రీమింగ్ వంటి ప్రత్యేకతలు ఈ డివైజ్‌లో ఒదిగి ఉన్నాయి. స్పెసిఫికేషన్‌లపరంగా ఈ రెండు గ్యాడ్జెట్‌ల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలాద్దాం...

డిస్‌ప్లే:

ఆమోజన్ కైండిల్ ఫైర్ హైడెఫినిషన్: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ( రిసల్యూషన్ 1,280 x 800పిక్సల్స్ ), 216పీపీఐ, వెడల్పు అయిన స్ర్ర్కీన్, పోలరైజింగ్ ఫిల్టర్.

గూగుల్ నెక్సస్ 7: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ( రిసల్యూషన్ 1,280 x 800పిక్సల్స్ ),

సైజ్ ఇంకా బరువు:

నెక్సస్ 7: చుట్టుకొలత (7.82 అంగుళాలు x 4.72అంగుళాలు), బరువు 0.75పౌండ్లు, మందం .41 అంగుళాలు.

కైండిల్ ఫైర్ హైడెఫినిషన్: చుట్టుకొలత (7.6 అంగుళాలు x 5.4అంగుళాలు), బరువు 0.87 పౌండ్లు, మందం .40 అంగుళాలు.

ప్రాసెసర్ ఇంకా ఆపరేటింగ్ సిస్టం:

నెక్సస్ 7: 1.3గిగాహెర్జ్ క్వాడ్-కోర్ ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కైండిల్ ఫైర్ హైడెఫినిషన్: 1.2గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ OMAP4460ప్రాసెసర్, పవర్ వీఆర్3డి గ్రాఫిక్స్ కోర్ యూనిట్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం.

నెక్సస్ 7 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో పోలిస్తే కైండిల్ ఫైర్ హైడెఫినిషన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ పనితీరు విషయంలో వెనుకబడి ఉంటుంది.

స్టోరేజ్ ఇంకా కనెక్టువిటీ:

నెక్సస్ 7, 8 ఇంకా 16జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. కైండిల్ ఫైర్ హైడెఫినిషన్ 16 ఇంకా 32జీబి మెమరీ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకోవచ్చు. నెక్సస్ 7లో నిక్షిప్తం చేసిన గూగుల్ ప్లే క్లౌడ్ ఆప్షన్ ద్వారా సినిమాలతో పాటు మ్యూజక్ ఇతర పుస్తకాలకు సంబంధించిన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. వై-ఫై, బ్లూటూత్ వ్యవస్థలు రెండు గ్యాడ్జెట్‌లలో సమానం. నెక్సస్ 7, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ వంటి ఆధునిక కనెక్టువిటీ ఫీచర్లను ఒదిగి ఉంది. కైండిల్ ఫైర్ హెచ్‌డి మైక్రోయూఎస్బీ ఇంకా హెచిడిఎమ్ఐ ఫీచర్లను ఒదిగి ఉంది.

కెమెరా ఇంకా స్పీకర్లు:

నెక్సస్ 7: 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

కైండిల్ ఫైర్ హైడెఫినిషన్: హైడెఫినిషన్ కెమెరా, డాల్బీ ఆడియోతో కూడిన డ్యూయల్ డ్రైవర్ స్టీరియో స్పీకర్స్,

బ్యాటరీ:

గూగుల్ నెక్సస్ 7: 4325ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ 8 గంటలు),

కైండిల్ ఫైర్ హైడెఫినిషన్: నాన్ రిమూవబుల్ బ్యాటరీ (బ్యాకప్ 11 గంటలు).

ధర ఇతర వివరాలు:

గెలాక్సీ నెక్సస్ 7, 8 జీబి వర్షన్ ధర రూ.11065, 16జీబి వర్షన్ ధర రూ.13831. కైండిల్ ఫైర్ హైడెఫినిషన్ 16జీబి ధర రూ.11065, 32జీబి ధర రూ.13831. కైండిల్ ఫైర్ హైడెఫినిషన్ టాబ్లెట్ లు అమ్మకాలు అక్టోబర్ 25 నుంచి ప్రారంభంకానున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot