బ్రేకింగ్ న్యూస్: వాళ్లిద్దరికి చెడింది?

Posted By: Super

 బ్రేకింగ్ న్యూస్: వాళ్లిద్దరికి చెడింది?

 

మైక్రోసాఫ్ట్ విండోస్, హెచ్‌టీసీల మధ్య గతంలో ఏర్పడిన బంధం క్రమక్రమంగా బలహీనపడుతున్నట్లు తెలుస్తోంది. హెచ్‌టీసీ, విండోస్ 8 ఆధారిత టాబ్లెట్ పీసీలను రూపొందిస్తున్నట్లు నిన్న మొన్నటి వరకు రూమర్లు వినిపించాయి. అయితే, వాటిలో వాస్తవం లేదని తేలిపోయింది. గతంలో వీరిద్దరి ఆధ్వర్యంలో రూపొందించబడిన ‘జెట్ స్ట్రీమ్’, ‘ఫ్లయిర్’ వంటి టాబ్లెట్ పీసీలు అమ్మకాల విషయంలో నిరాశాజనకమైన ఫలితాలు రాబట్టటంతో విస్తు చెందిన విండోస్ హెచ్‌టీసీ పై అంతగా ఆసక్తి చూపటం లేదని మార్కెట్ వర్గాల టాక్.  ఈ కారణాల చేత మైక్రోసాఫ్ట్.. సామ్‌సంగ్, ఏసర్, అసస్, హెచ్‌పీలతో ఒప్పందం కుదర్చుకుని టాబ్లెట్ పీసీలను రూపొందింస్తుంది. హెచ్‌టీసీకి ఈ వార్త  మింగుడుపడనప్పటికి  భవిష్యత్ లో ఈ విధమైన ఆవరోధాలను ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.

విజృంభించేందుకు ‘విండోస్’ సిద్ధం!

టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో సంచాలనికి తెరలేపింది. సరికొత్త విండోస్ ఫోన్ టాంగో ఆపరేటింగ్ సిస్టంను ఈ  జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్కెట్లోకి రానున్న టాంగో ఆపరేటింగ్ సిస్టం అత్యాధునిక ఫీచర్లను కలిగి యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ కంప్యూటింగ్‌కు సహకరిస్తుంది. ఈ వోఎస్ తొలి ఎడిషన్‌ను చైనాలో లాంఛ్ చేస్తారు. తరువాత ఇతర దేశాల్లో ఉంటుంది. కాగా, విండోస్ ఫోన్ టాంగో అప్‌డేట్‌ను ఇప్పటికే వృద్థి చేసినట్లే మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot