నోకియా వచ్చేసింది.. ఆండ్రాయిడ్ టాబ్లెట్‌తో

|

గతేడాది ఏప్రిల్‌లో తమ డివైసెస్ ఇంకా సర్వీసెస్ విభాగాలను మైక్రోసాఫ్ట్‌కు విక్రయించేసిన నోకియా ఆ తరువాత తొలిసారిగా ఎన్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ ఆవిష్కరణతో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలోకి అడుగుపెట్టింది.

 
నోకియా వచ్చేసింది.. ఆండ్రాయిడ్ టాబ్లెట్‌తో

తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సరఫరాదారు ఫాక్స్‌కాన్‌తో జతకట్టి నోకియా సరికొత్త ఎన్1 ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను చైనాలో జరిగిన టెక్నాలజీ ఫెయిర్‌లో ప్రదర్శించింది. 2015, ఫిబ్రవరి 19 (చైనా న్యూ ఇయర్) నుంచి వీటిని చైనా మార్కెట్లో విక్రయిస్తారు. ఆ తరువాత రష్యా ఇంకా యూరోపియన్ మార్కెట్లలో విడుదల చేస్తారు.

 

ఈ టాబ్లెట్ తయారీ నుంచి విక్రయం వరకు, కస్టమర్ కేర్ నుంచి సాఫ్ట్‌వేర్ లైసెన్సింగ్ వరకు పూర్తి హక్కులు ఫాక్స్‌కాన్ దే బాధ్యత. ఎన్1 ఆండ్రాయిడ్ టాబ్లెట్ రూపకల్పనకు సంబంధించి తన బ్రాండ్‌తో పాటు కొన్ని పేటెంట్ టెక్నాలజీలను మాత్రమే నోకియా అందించింది.

నోకియా ఎన్1 టాబ్లెట్ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. 7.9 అంగుళాల ఐపీఎస్ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే (గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో), 64బిట్ 2.3గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ జెడ్3580 ప్రాసెసర్, పవర్ వీఆర్ జీ6430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్), 5300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, టాబ్లెట్ బరువు 318 గ్రాములు. ధర 240 డాలర్లు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Nokia launches Android tablet. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X