నోకియా లూమియా 2520 vs యాపిల్ ఐప్యాడ్ ఏయిర్ vs సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1

|

క్నాలజీ ప్రపంచంలో దిగ్గజాల త్రిముఖ పోరు రాజుకుంది. అంతర్జాతీయ టెక్ మార్కెట్లో గత రెండు రోజులుగా చోటుచేసుకున్న నోకియా, యాపిల్ ట్యాబ్లెట్ ఆవిష్కరణలు అనేక విశ్లేషణలకు తెరలేపాయి. నోకియా నుంచి విడుదలైన మొట్టమొదటి ట్యాబ్లెట్ లూమియా 2520 పై మార్కెట్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు యాపిల్ నుంచి విడుదులైన కొత్తవర్షన్ ట్యాబ్లెట్ ‘ఐప్యాడ్ ఎయిర్'వేగవంతమైన ప్రాసెసింగ్ ఫీచర్లతో కొత్త ట్రెండ్ దిశగా దూసుకువెళుతోంది. ఈ నేపధ్యంలో మరో ట్యాబ్లెట్ సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1 విక్రయాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. ఈ ట్యాబ్లెట్ల ఎంపికలో భాగంగా వినియోగాదారుడికి నిర్థిష్టమైన అవగాహనను కల్పించే క్రమంలో గిజ్‌బాట్ ఓ విశ్లేషణాత్మకమైన కథనాన్ని ప్రచరిస్తోంది.మీరు ఎంపిక చేసుకోబోయే

స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 నోకియా లూమియా 2520 vs యాపిల్ ఐప్యాడ్ ఏయిర్ vs సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1

డిస్‌ప్లే:

ఈ మూడు ట్యాబ్లెట్‌లకు సంబంధించి డిస్‌ప్లే సైజులను పరిశీలించినట్లయితే, మూడు ట్యాబ్లెట్‌లు 10 అంగుళాల స్ర్కీన్ సైజులను కలిగి ఉన్నాయి. అయితే, స్ర్కీన్ క్వాలిటీ ఇంకా పిక్సల్డెన్సిటీలో తేడాలు ఉంటాయి. గెలాక్సీ నోట్ 10.1 సూపర్ క్లియర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే‌తో 299 పిక్సల్ పర్ ఇంచ్ (పీపీఐ) సామర్ద్యాన్ని కలిగి ఉంది. ఐప్యాడ్ ఎయిర్ 10 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతో 246 పిక్సల్ పర్ ఇంచ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరోవైపు నోకియా లూమియా 2520 10 అంగుళాల డిస్‌ప్లేతో కేవలం 218 పీపీఐ సామర్ధ్యాన్ని మాత్రమే కలిగి ఉంది.

డిస్‌ప్లే విభాగంలో గెలుపు ఎవరిదింటే..?
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1

పనితీరు:

ఈ మూడు ట్యాబ్లెట్‌లకు సంబంధించి పనితీరును పరిశీలించినట్లయితే... యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ అత్యాధునిక యాపిల్ ఏ7 ఆర్కిటెక్షర్ ప్రాసెసింగ్ వ్యవస్థను కలిగి ఉంది. సామ్‌‍సంగ్ ఇంకా నోకియా ట్యాబ్లెట్‌లు స్నాప్‌డ్రాగెన్ 800 ప్రాసెసర్‌లను మాత్రేమ కలిగి ఉన్నాయి. ఈ ప్రాసెసర్లు శక్తివంతమైనప్పటికి యాపిల్ ఏ7 ప్రాసెసర్‌తో పోలిస్తే తక్కువ పనితీరును కనబరుస్తాయి!.

పనితీరు విభాగంలో గెలుపు ఎవరిదంటే..?
యాపిల్ ఐప్యాడ్ ఎయిర్.

కెమెరా:

ఈ మూడు ట్యాబ్లెట్‌లకు సంబంధించి కెమెరా ఫీచర్‌ను విశ్లేషించినట్లయితే... యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్ వ్యవస్థను కలిగి ఉంది. సామ్‌సంగ్ ఇంకా నోకియా ట్యాబ్లెట్‌లు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌లను కలిగి ఉన్నాయి. రేర్ కెమెరా ఫీచర్ కెమెరా విషయంలో సామ్‌సంగ్ ముందుంజలో ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉండగా నోకియా లూమియా 2520 మాత్రం 6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది.

కెమెరా విభాగంలో గెలుపు ఎవరిదంటే..?
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1

ధరలు:

ఇండియన్ మార్కెట్లో ఈ మూడు ట్యాబ్లెట్‌ల ధరలను పరిశీలించినట్లయితే..... సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10.1 మార్కెట్లో రూ.49,000కు లభ్యమవుతోంది. ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ ధర అంచనా రూ.38,000. నోకియా లూమియా 2520 ధర అంచనా రూ.30,470.

ఆపరేటింగ్ సిస్టం:

ఈ ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి ఆపరేటింగ్ సిస్టంలను పరిశీలించినట్లయితే పరిశీలించినట్లయితే... లూమియా 2520 విండోస్ 8 ఆర్‌టి ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఐప్యాడ్ ఎయిర్ ఐఓఎస్ 7 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. గెలాక్సీ నోట్ 10.1 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి అప్లికేషన్‌ల అందుబాటు విషయంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లు ముందుంజలో ఉన్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X