ఆపిల్‌ను వెనక్కు నెట్టే పనిలో నోకియా..?

Posted By: Super

ఆపిల్‌ను వెనక్కు నెట్టే పనిలో నోకియా..?

 

ప్యారిస్: అత్యుత్తమ మొబైల్ పరికరాల తయారీదారు ‘నోకియా’ తాజాగా ట్యాబ్లెట్ కంప్యూటర్ల పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆధారిత ట్యాబ్లెట్ పీసీని 20102లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నోకియా ఫ్రాన్స్ అధికార ప్రతినిధి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపధ్యంలో నోకియా తీసుకున్న తాజా నిర్ణయం అభిమానుల్లో ఉత్సకతను రేపుతుంది.

అత్యాధునిక ‘విండోస్ 8’ ఆపరేటింగ్ వ్యవస్థను ఈ పీసీలో లోడ్ చేయునున్నట్లు తెలుస్తోంది. తాము అత్యాధునిక ఫీచర్లతో ప్రవేశపెట్టబోతున్న విండోస్ టాబ్లెట్, ఆపిల్ ఐప్యాడ్ కు పోటిగా నిలుస్తుందని నోకియా వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. ఇటీవల మ్యూజిక్ గ్యాడ్జెట్ల తయారీ పై దృష్టిసారించిన ‘నోకియా’ సఫలీకృతమైన సంగతి తెలిసిందే. ఇటీవల మ్యూజిక్ గ్యాడ్జెట్ల తయారీ పై దృష్టిసారించిన ‘నోకియా’ సఫలీకృతమైన సంగతి తెలిసిందే.స్మస్ కానుకగా ‘నోకియా’ విండోస్ ఆధారిత ఫోన్లను విడుదల చేయునుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot