లిప్ రీడింగ్ ఆధారంగా మనిషి ఫీలింగ్‌ను పసిగట్టే కంప్యూటర్!

Posted By: Staff

లిప్ రీడింగ్ ఆధారంగా మనిషి ఫీలింగ్‌ను పసిగట్టే కంప్యూటర్!

 

 

లిప్ రీడింగ్ ఆధారంగా మనిషి భావోద్వేగాలను పసిగట్టే సరికొత్త కంప్యూటర్ పరిజ్ఞానాన్ని మలేషియాలోని మణిపాల్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయానికి చెందిన కార్తీగాయన్ ముతుకారుప్పన్ అతని సహచర బృందం వృద్ధి చేసింది. ఈ పరిజ్ఞానం మరింతగా అందుబాటులోకి వస్తే మాట్లాడేశక్తిని కోల్పొయిన వికలాంగులు తమ భావోద్వేగాల ద్వారా మాటలను వ్యక్తీకరించవచ్చు. జన్యు అల్గోరిథం అనే పద్ధతిని ఉపయోగించి ఈ ప్రయోగంలో సత్ఫలితాన్ని సాధించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా వివిధ వ్యక్తులు భావాద్వేగాలను కంప్యూటర్‌లో ఫీడ్ చేశారు. సేకరించిన ఫోటోలు దక్షిణ తూర్పు ఆసియా అదేవిధంగా జపాన్‌కు చెందిన వ్యక్తులవి. ఆనందం, విచారం, భయం, కోపం, చిరాకు, ఆశ్చర్యం, తటస్థ వ్యక్తీకరణలను గ్రహించే విధంగా వీరు కంప్యూటర్‌కు శిక్షణనిచ్చారు.

ఫేస్ రోబో..!

సాంకేతికత సాయంతో రూపుదిద్దుకుంటున్న రోబోట్‌లు, మనుషుల్లా భావోద్వేగాలను పలికించలేవన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటలీలోని పీసా విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు పరిశోధకులు మానవుల్లాగా సహజమైన రీతిలో భావోద్వేగాలను పలికించే ‘ఫేస్’రోబోను రూపొందించారు. పై చిత్రంలో భామను పోలి ఉన్న ఆ రోబో సహజసిద్ధమైన రీతిలో ముఖ కవళికలను కలిగి వ్యక్తీకరణలను పలికించిన వైనాన్ని వేరువేరు చిత్రాత ద్వారా గమనించవచ్చు. ఆ రోబోను ఇలా తీర్చిదిద్దటానికి పరిశోధకులకు 30 సంవత్సరాల సమయం పట్టిందట. ఈ రోబో భామ ముఖంలో ఉండే 32 మోటార్లు వివిధ భావోద్వేగాలను పలికించడంలో సాయపడతాయి. హెఫెస్(హైబ్రీడ్ ఇంజిన్ ఫర్ ఫేసియల్ ఎక్స్‌ప్రెషన్స్ సింథసిస్) అనే సాఫ్ట్‌వేర్ సాయంతో ఈ మొత్తం రోబో పనిచేస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting