దమ్మున్న ల్యాప్‌టాప్ 25వేలకే!!

Posted By: Super

దమ్మున్న ల్యాప్‌టాప్ 25వేలకే!!

 

సుపరిచిత బ్రాండ్ హెచ్‌పీ ఉత్తమ కంప్యూటింగ్ విలువలతో కూడిన పీచర్ రిచ్ ల్యాప్‌టాప్‌ను కేవలం 23500కే అందిస్తోంది. హెచ్‌పీ పెవిలియన్ సిరీస్ నుంచి వస్తున్న ఈ డివైజ్ మోడల్ నెంబర్ dm1-3210us.అన్ని విధాలైన కమ్యూనికేషన్ అవసరాలను తీర్చే ఈ ఆల్ ఇన్ వన్ పీసీ మరింత  సౌకర్యవంతమైన ఆపరేటింగ్‌కు తోడ్పడుతుంది.

ఈ డివైజ్‌ను ఆపరేట్ చేసే సమయంలో  వినియోగదారు ఏ విధమైన  అసహనానికి లోనుకాడు.  గృహ వినియోగం మొదలుకుని విద్య ఇతర వ్యాపార  సంబంధిత అవసరాలను ఈ పీసీ సమర్ధవంతంగా తీరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ  ల్యాపీ వినియోగం మీ కమ్యూనికేషన్ బంధాలను మరింత ధృడపరుస్తుంది.

ల్యాపీ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:

*   విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

*   11.6 అంగుళాల హై డెఫినిషన్ బ్రైట్ వ్యూ స్ర్కీన్,

*   డ్యూయల్ కోర్ ఈ-350 ప్రాసెసర్,

*   350జీబి హార్డ్ డిస్క్ డ్రైవ్

*   ఏఎమ్ డి రాడియోన్ హై డెఫినిషన్  6310 డిస్ర్కీట్ క్లాస్ గ్రాఫిక్ కార్డ్,

*   9.5గంటల సుదీర్ఘ బ్యాకప్ నిచ్చే6-సెల్ లియోన్ బ్యాటరీ.

పటిష్టమైన మల్టీ మీడియా వ్యవస్థను పీసీలో నిక్షిప్తం చేశారు. ఈ సౌలభ్యతతో మన్నికైన వినోదాన్ని శ్రోత ఆస్వాదించవచ్చు. భవిష్యత్ అవసరాలను పరిగణలోని తీసుకుని పలు ఆధునిక  స్పెసిఫికేషన్‌లను పీసీలో ఇన్‌బుల్ట్ చేశారు. యూజర్ ఫ్రెండ్లీ స్వభావం హెచ్చుగా ఉన్న విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం పై ల్యాపీ పనిచేయటం మరో విశేషం.

ఆధునిక అప్లికేషన్‌లను సైతం ఈ ఈవోఎస్ పై రన్ చేసుకోవచ్చు. నిక్షిప్తం చేసిన డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ల్యాపీ పనివేగాన్ని స్థాయికి తగ్గకుండా చూస్తుంది. తక్కువ ధరకు అత్యుత్తమ కంప్యూటింగ్

గ్యాడ్జెట్‌ను సొంతం చేసుకోవాలనుకునేవారికి హెచ్‌పీ పెవిలియన్ dm1-3210us ఉత్తమ ఎంపిక.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot