రూ.6,999కే ఆండ్రాయిడ్ ఐసీఎస్ ట్యాబ్లెట్

Posted By:

పూణే కంపెనీ, ఎన్ఎక్స్‌జి ఎలక్ట్రానిక్స్ ‘ఎక్స్ ట్యాబ్ ఏ9' మోడళ్లో సరికరొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ధర రూ.6,999. ఈ నాజూకు శ్రేణి పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్ ఉత్తమ శ్రేణి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. వాటి వివరాలు.....

డిస్‌ప్లే: 7 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,
ప్రాసెసర్: 1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
కెమెరా: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు,
స్టోరేజ్: 8జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ: 3జీ కనెక్టువిటీ వయా డాంగిల్, వై-ఫై, మినీ హెచ్‌డిఎమ్ఐ అవుట్, మైక్రోయూఎస్బీ,
బ్యాటరీ: 3600ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ 4 గంటలు),

రూ.6,999కే ఆండ్రాయిడ్ ఐసీఎస్ ట్యాబ్లెట్

ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు:

ఫేస్‌బుక్, కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, ఫేస్‌బుక్ మెసెంజర్, ఎన్‌డిటీవీ, ఎన్‌ఎక్స్‌జి బ్లాగ్‌జిగ్ అప్లికేషన్, ఎన్‌ఎక్స్‌జి సపోర్ట్ అప్లికేషన్, రాక్ ప్లేయర్ లైట్, స్కైప్, స్పార్ష్ ఇండియన్ కీబోర్డ్ అప్లికేషన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, యునీకార్న్ డాష్, వాట్స్అప్లికేషన్, యూట్యూబ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot