సస్పెన్స్‌కు తెరపడింది..?

By Super
|
Official ICS update for Acer Iconia Tab A500


అభిమానుల నిరీక్షణ ఫలిచింది.. వాయిదాపడుతూ వస్తున్న ఓ బృహత్తర నవీకరణ ఆచరణకు నోచుకుంది.. వివరాల్లోకి వెళితే, ప్రముఖ బ్రాండ్ ఏసర్ రూపొందించిన ‘ఐకోనియా ట్యాబ్ 500’ టాబ్లెట్ కంప్యూటర్‌కు ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్ లభించింది. ప్రస్తుతానికి ఈ తాజా ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్ యూఎస్, కెనడాలోని యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. తొలత ఈ అప్‌డేట్‌ను ఫిబ్రవరిలో ప్రకటించారు. పలు కారణాల రిత్యా ఈ ఆవిష్కరణ ఏప్రిల్ వరకు వాయిదా పడింది.

ఈ తాజా వోఎస్ అప్‌డేట్‌తో చేకూరే లాభాలు:

మెరుగైన యూజర్ ఇంటర్ ఫేస్,

క్వాలిటీ కమ్యూనికేషన్,

యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్,

వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్.

ఏసర్ ఐకోనియా ట్యాబ్ ఏ500 ఫీచర్లు:

10.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 X 800పిక్సల్స్),

1గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

డాల్బీ ఆడియో మొబైల్ టెక్నాలజీ,

వై-ఫై,

బ్లూటూత్,

హెచ్‌డిఎమ్ఐ పోర్టు,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

16జీబి ఇంటర్నల్ మెమరీ,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీని 32జీబి వరకు పెంచుకునే సౌలభ్యత,

లై-పాలిమర్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X