సరికొత్త సాంకేతిక హంగులతో ‘ఆలివ్ ప్యాడ్’..!!

Posted By: Super

సరికొత్త సాంకేతిక హంగులతో ‘ఆలివ్ ప్యాడ్’..!!

సరికొత్త సాంకేతిక హంగులతో ‘ఆలివ్ ప్యాడ్ 2’ త్వరలో వినియోగదారులను ఆకట్టుకోనుంది. ఆధునిక ఆండ్రాయిడ్ 2.3 వర్షన్ ఆపరేటింగ్ వ్యవస్థతో పాటు శక్తివంతమైన ప్రొసెసింగ్ వ్యవస్థను ఈ టాబ్లెట్ పీసీలో పొందుపరిచారు. మునుపటి ‘ఆలివ్ ప్యాడ్’తో పోల్చుకుంటే విడుదల కాబోతున్న సరికొత్త ‘ఆలివ్ ప్యాడ్ 2’ క్లాసికల్ లుక్ తో పాటు తక్కువ బరువు కలిగి ఉంటుంది.

సాఫ్ట్ వేర్ స్పెసిఫికేషన్ అంశాలను పరిశీలిస్తే ఆండ్రాయిడ్ జింజర్ బోర్డు 2.3 ఆపరేటింగ్ వ్యవస్థ, 1 జీగాహెడ్జి ప్రొసెసర్, 512 ఎంబీ కలిగిన ర్యామ్ వ్యవస్థలు సమర్ధమైన పనితీరును కలిగి ఉంటాయి. సరికొత్త కనెక్టువిటీ మార్పులతో విడుదల కాబోతున్న ‘ఆలివ్ ప్యాడ్ 2’ ఖచ్చితంగా వినియోగదారుడుని ఆకర్షిస్తుందనే చెప్పాలి. ఆధునిక మార్పులతో పటిష్టపరిచిన వై - ఫై, హెచ్ఎస్డీపీఏ, 3జీ నెటవర్కింగ్ వ్యవస్థలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టపరుస్తాయి.

‘ఆలివ్ ప్యాడ్’ విడుదలపై సంస్ధ చైర్మన్ అరుణ్ కన్నా స్పందిస్తూ మరిన్ని స్మార్ట్ ఫోన్లతో పాటు టాబ్లెట్ పీసీలను మార్కెట్లో విడుదల చేసి తమ పరిధిని విస్తరించుకునేందుకు దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. తాము విడుదల చేయుబోతున్న తాజా టాబ్లెట్ పీసీ అధునాతన సాంకేతిక వ్యవస్థతో రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు.

‘ఆలివ్ ప్యాడ్ 2’ కెమెరా అంశాలను పరిశీలిస్తే ముందు వెనక భాగాలో పొందుపరిచిన రెండు కెమెరాలు నాణ్యమైన మన్నికతో వీడియోలతో పాటు ఫోటోలను అందిస్తాయి. 7 అంగుళాల టచ్ స్క్రీన్ సామర్ధ్యం, ఆకట్టకునే పిక్సల్ రిసల్యూషన్, మెమరీ వృద్ధికి మైక్రో ఎస్డీ అంశాలు వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. ‘ఆలివ్ ప్యాడ్’ మార్కెట్ ధర రూ.20,000 ఉండోచ్చని తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot