ఊపందుకుంటున్న ‘సొంతగూటి’ వ్యాపరం..!!

Posted By: Super

ఊపందుకుంటున్న ‘సొంతగూటి’ వ్యాపరం..!!

టాబ్లెట్ పీసీలను తయారు చేసున్న ప్రపంచ దిగ్గజ బ్రాండ్లకు దీటుగా భారత్‌లో టాబ్లెట్ల తయారీ వ్యవస్థ ఊపందుకుంటుంది. సొంతిగూటి కంపెనీ అయిన 'రిలయన్స్ 3జీ టాబ్లెట్‌" ను మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉన్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న తొలి భారతీయ టాబ్లెట్ పీసీగా రిలయన్స్ గుర్తింపుతెచ్చుకుంది.

అయితే ఇదే బాటలోనే సొంతగూటి కంపెనీ 'ఆలివ్" టెలికామ్ టాబ్లెట్ల రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆలివ్‌ప్యాడ్ 'వీటీ 100" (VT100) పేరుతో వినూత్న టాబ్లెట్ పీసీని మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తుంది. రూపుదిద్దకుంటున్న 'ఆలివ్" బ్రాండ్ టాబ్లెట్‌లోని ప్రత్యేకాంశాలను పరిశీలిస్తే ఏ టాబ్లెట్‌లో లేని వినూత్న అంశాన్ని ఈ టాబ్లెట్‌లో పొందుపరిచారు. ఈ టాబ్లెట్ ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు.

ఈ రెండు టాబ్లెట్లలోని ఫీచర్లను పరిశీలిస్తే రిలియన్స్ టాబ్లెట్లను చైనా కంపెనీ ZTE తయారు చేసింది. 7 అంగుళాల టచ్ స్క్రీన్ సామర్ధ్యం కలిగిన ఈ టాబ్లెట్ 512 MB ర్యామ్ వ్యవస్థ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దకున్న రిలియన్స్ టాబ్లెట్ 2 మెగా పిక్సల్ కలిగిన ఫ్రెంట్, బ్యాక్ కెమెరాలను కలిగి ఉంది.

'ఆలివ్" టాబ్లెట్ అంశాలను పరిశీలిస్తే 7 అంగుళాల టచ్ స్ర్కీన్ సామర్ధ్యం కలిగి, 3 మెగా పిక్సల్ కెమెరా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా రూపుదిద్దకున్న ఈ టాబ్లెట్ 512MB ఇంటెర్నల్ మెమరీ కలదు.

కెనక్టువిటీ అంశాలను పరిశీలిస్తే 'రిలియన్స్ 3జీ నెట్ వర్క్"తో అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తుంది. టాబ్లెట్లోని ప్రత్యేకాంశాలను పరిశీలిస్తే మొబైల్ టివీ అప్లికేషన్, వాయిస్ మెయిలింగ్ వంటివి ఆకట్టకుంటాయి. టాబ్లెట్లో ముందుగానే లోడ్ చేసిన సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు, ఇతర అంశాలు వినియోగదారులను ఉపయుక్తంగా నిలుస్తాయి.

ఆలివ్ ప్యాడ్ 'వీటీ100"లోనూ ప్రత్యేక ఫీచర్లను పొందుపరిచారు. ఈ టాబ్లెట్లో పొందుపరిచిన ఆర్గనైజర్ ఆప్లికేషన్లు వరల్డ్ క్లాక్, స్టాప్ వాచ్, కంపాస్, జీ సెన్సార్స్ వంటి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అత్యుత్తమ నెటవర్క్ తో రిలయన్స్ 3జీ ధర మార్కెట్లో రూ.12999 ఉండగా, ఆలివ్ ప్యాడ్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.19990గా నిర్థారించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot