హెచ్‌పి నుంచి సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్స్

|

గేమింగ్ ల్యాప్‌టాప్‌ల విభాగంలో తన మార్కెట్ పరిధిని మరింత విస్తరిస్తూ రెండు సరికొత్త గేమింగ్
నోట్‌బుక్‌లను హెచ్‌పీ సంస్థ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఒమెన్ (Omen) సిరీస్ నుంచి లాంచ్ అయిన ఈ రెండు ల్యాప్‌టాప్‌లు ఒమెన్ 15, ఒమెన్ 17 రేంజ్‌ల‌లో అందుబాటులో ఉంటాయి. ఒమెన్ 15 ప్రారంభ వేరియంట్ ధర రూ.80,990. ఒమెన్ 17 ప్రారంభ వేరియంట్ ధర రూ.1,59,990.

HP launches new OMEN gaming notebooks

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే ఈ గేమింగ్ డివైస్‌లలో Nvidia సంస్థ రూపొందించిన శక్తివంతమైన జీఫోర్స్ జీటీఎక్స్ 10-సిరీస్ గ్రాఫిక్ వ్యవస్థలను హెచ్‌పి నిక్షిప్తం చేసింది. ఈ ల్యాపీలలో ఏర్పాటు చేసిన సింగిల్ - యాక్సెస్ సర్వీస్ ప్యానల్ ద్వారా ర్యామ్, హార్డ్‌డిస్క్ డ్రైవ్ ఇంకా ఎస్ఎస్‌డి స్టోరేజ్‌లను అప్‌గ్రేడ్ చేసుకునే వీలుంటుంది.

CE070TX, CE071TX, CE072TX, CE073TX, CE074TX ఇలా 5 మోడల్స్‌లో ఒమెన్ 15 ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంటుంది. వీటిలో బేస్ వర్షన్ వచ్చేసరికి సెవెన్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ 2.5GHz i5-7300HQ చిప్‌సెట్ పై రన్ అవుతుంది. 8జీబి డీడీఆర్4 ర్యామ్ (అప్‌గ్రేడబుల్ టు 16జీబి), 1టీబీ సీరియల్ ఏటీఏ హార్డ్‌డిస్క్ డ్రైవ్, ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 1050 విత్ 2జీబి జీడీడీఆర్5 వీడియో ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ మోడల్‌లో ఉంటాయి.

ఇక టాప్-ఎండ్ మోడల్ వర్షన్ వచ్చేసరికి సెవెన్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ 2.8GHz i7-7700HQ చిప్‌సెట్ పై రన్ అవుతుంది. 16జీబి డీడీఆర్4 ర్యామ్, 1టీబీ సీరియల్ ఏటీఏ హార్డ్‌డిస్క్ డ్రైవ్, 128GB NVMe TLC M.2 SSD, ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 1050 విత్ 6జీబి జీడీడీఆర్5 వీడియో ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ మోడల్‌లో ఉంటాయి.

ఫేస్‌బుక్‌లో సమస్యలా?ఫేస్‌బుక్‌లో సమస్యలా?

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఒమెన్ 15 బేస్ మోడల్ 15.6 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లేను క్యారీ చేస్తుంది. ఈ డిస్‌ప్లే 1920x1080 పిక్సల్స్ ఫుల్ హెచ్‌డి రిసల్యూషన్‌తో పాటు 45శాతం కలర్ గామట్‌ను ఆఫర్ చేస్తుంది. ఇక టాప్-ఎండ్ మోడల్ వర్షన్ వచ్చేసరికి 15.6 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లేను క్యారీ చేస్తుంది. ఈ డిస్‌ప్లే 3840x2160 పిక్సల్స్ అల్ట్రా హెచ్‌డి రిసల్యూషన్‌తో పాటు 72శాతం కలర్ గామట్‌ను ఆఫర్ చేస్తుంది.

ఇక ఒమెన్ 17 రేంజ్ నుంచి AN009TX, AN010TX మోడల్స్‌లో ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిలో మొదటి మోడల్ 17.3 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లేను క్యారీ చేస్తుంది. ఈ డిస్‌ప్లే 1920x1080 పిక్సల్స్ ఫుల్ హెచ్‌డి రిసల్యూషన్‌తో పాటు 72శాతం కలర్ గామట్‌ను ఆఫర్ చేస్తుంది. సెవెన్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ 2.8GHz i7-7700HQ చిప్‌సెట్ పై ఇవి రన్ అవుతాయి. 16జీబి డీడీఆర్4 ర్యామ్ (అప్‌గ్రేడబుల్ టు 32జీబి), 1టీబీ సీరియల్ ఏటీఏ హార్డ్‌డిస్క్ డ్రైవ్, 256GB NVMe TLC M.2 SSD.

డ్రాగన్ రెడ్ బ్యాక్‌లైట్ ఐల్యాండ్ స్టైల్ కీబోర్డ్ విత్ న్యూమరిక్ కీప్యాడ్, మల్టీ-టచ్ గెస్ట్యుర్ సపోర్టెడ్ హెచ్‌పీ ఇమేజ్ ప్యాడ్, వీఆర్-రెడీ సపోర్ట్, డీటీఎస్ హెడ్‌ఫోన్, ఎన్‌హాన్సుడ్ 360-డిగ్రీ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్, బ్యాంగ్ & ఓలోఫ్సన్ ఆడియో వంటి హైలైట్ ఫీచర్స్ ఈ నోట్‌బుక్‌లలో ఉన్నాయి.

Best Mobiles in India

Read more about:
English summary
It comes with 4K display1 option for high-resolution content playback, or a 120Hz 1080p display option for fast refresh-rates2 with NVIDIA G-Sync™ options

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X