లండన్ బార్‌లో ‘సెల్ఫీ’ దెయ్యం..?

Posted By:

లండన్‌లోని ఓ ప్రముఖ బార్‌లో మత్తుగా చిత్తుగా ఎంజాయ్ చేస్తూ ఇద్దరు మహిళలు చిత్రీకరించుకున్న ఓ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీ సోషల్ మీడియాలో పెను దుమారమే రేపుతోంది. ఈ క్రేజీ సెల్ఫీలో ఓ అనుమానాస్పద రూపం తారసపడటమే ఇందుకు కారణం. వెబ్ మీడియాలో సంచలనం రేపుతోన్న ఈ మిస్టరీకి సంబంధించి వివరాలను పరిశీలించినట్లయితే..

లండన్ బార్‌లో ‘సెల్ఫీ’ దెయ్యం..?

న్యూకాస్టిల్‌కు చెందిన విక్టోరియా గ్రీవ్స్ (22), కేలే ఆట్కిన్సన్ (23)లు ఓ ప్రముఖ బార్‌‌లో నైట్‌అవుట్ చేస్తూ డ్రింకింగ్ పూర్తి అయిన అనంతరం ఓ సెల్ఫీని చిత్రీకరించకున్నారు. అనంతరం ఆ మహిళలు తాము చిత్రీకరించుకున్న సెల్ఫీలో భయానక రూపంతో కూడిన ఓ అనుమానాస్పద వృద్ధ మహిళ తారసపడటాన్ని చూసి నిర్ఘాంతపోయారు.

తొలత ఈ ఫోటోను  స్నాప్‌చాట్‌లో అప్‌లోడ్ చేసారు. ఆ తరువాత భయపడి తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి డిలీట్ చేసేసారు. అయినప్పటికి ఈ అనుమానాస్పద సెల్ఫీ ఇంటర్నెట్‌‍లో హల్‌చల్ చేస్తోంది.

English summary
OMG! Ghost appears in a selfie clicked at a London bar. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot