ఈ ట్రిక్‌తో మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ 50% ఆదా

Written By:

ల్యాప్‌టాప్ యూజర్లు తమ డివైస్ బ్యాటరీ బ్యాకప్‌ను 50% వరకు ఆదా చేసుకునేందుకు ప్రముఖ వెబ్‌బ్రౌజర్ Opera సరికొత్త పవర్‌ సేవ్ మోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ల్యాప్‌టాప్‌లలో ఒపెరా బ్రౌజర్‌ను ఉపయోగించుకుంటోన్న యూజర్లు Opera 39 వర్షన్‌కు అప్‌గ్రేడ్ అవ్వటం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను 50 శాతం వరకు పెంచుకోవచ్చు.

 ఈ ట్రిక్‌తో మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ 50% ఆదా

Read More : ఇప్పటికిప్పుడు అణు యుద్ధం జరిగితే...

ఈ న్యూ వర్షన్ బ్రౌజర్‌‌లో పొందుపరిచిన పవర్ సేవింగ్ మోడ్, రన్ అవుతోన్న ల్యాపీకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ టాబ్ యాక్టివిటీలను రెడ్యూస్ చేయటం, పేజ్ రీడ్రాయింగ్ ఫ్రీక్వెన్సీని అడాప్ట్ చేసుకోవటం, వీడియో ప్లే బ్యాక్ పారామీటర్లను ట్యూన్ చేయటం వంటి అంశాల పై నిరంతర పర్యవేక్షణతో పొదుపు చర్యలకు ఉపక్రమించిటం వల్ల పవర్ సేవింగ్ సాధ్యమవుతుంది.

 ఈ ట్రిక్‌తో మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ 50% ఆదా

Read More : రూ.4,799కే రిలయన్స్ LYF 4జీ ఫోన్

ఒపెరా బ్రౌజర్ పవర్ సేవింగ్ మోడ్ను ఉపయోగించుకోవాలంటే బ్రౌజర్ పేజీలో సెర్చ్ ఇంకా అడ్రస్ ఫీల్డ్ పక్కన కనిపించే బ్యాటరీ అకౌంట్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ల్యాప్‌టాప్ బ్యాటరీ lOW చూపించిన వెంటనే పవర్ సేవిండ్ మోడ్‌ను ఎనేబుల్ చేయబడిన బ్రౌజర్ మీకు సజెస్ట్ చేస్తుంది. ఒపెరా బ్రౌజర్ రీసెంట్‌గా తన డెస్క్‌టాప్ బ్రౌజర్ అలానే ఒపెరా మినీ మొబైల్ బ్రౌజర్ కోసం నేటివ్ యాడ్ బ్లాకింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

English summary
Opera Power Saving Mode will save your laptop’s battery by up to 50%. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot