హిట్ల వేటలో ‘ఆరెంజ్’!

Posted By: Prashanth

హిట్ల వేటలో ‘ఆరెంజ్’!

 

సాంట్రా క్లారా స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టి సక్సెస్‌ను మూటగట్టుకున్న ‘ఆరెంజ్’బ్రాండ్, అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో కూడిన టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేసింది. పేరు ‘ఆరెంజ్ తాహితీ’.డివైజ్‌లో అమర్చిన 7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్ర్కీన్ సినిమాలు వీక్షించేందుకు అదేవిధంగా ఈ-పుస్తకాలను చుదువుకునేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ వెడల్పాటి డిస్‌ప్లే ద్వారా క్లారిటీతో కూడిన వీడియో చాటింగ్ నిర్వహించుకోవచ్చు.

పీసీ బరువు 390 గ్రాములు. ఏర్పాటు చేసిన రెండు ఫిజికల్ బటన్లు సమర్ధవంతంగా స్పందిస్తాయి. ఆండ్రాయిడ్ 2.3 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం పై గ్యాడ్జెట్ రన్ అవుతుంది. యూజర్ ఫ్ఱెండ్లీ స్వభావం కలిగిన ఈ వోఎస్ ద్వారా సులభతరమైన కంప్యూటింగ్ నిర్వహించుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్టోర్ ద్వారా నచ్చిన అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

లోడ్ చేసిన డ్యూయల్ కోర్ 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్ అనుభవపూర్వకమైన మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. టాబ్లెట్‌లో ఫిక్స్ చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. హైస్పీడ్ డెటా కనెక్టువిటీ ఫీచర్లను ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేశారు వాటి వివరాలు.

- 3జీ హెచ్ఎస్‌డీపీఏ,

- వై-ఫై,

- జీపీఎస్ నావిగేషన్,

- బ్లూటూత్ 2.1,

- మైక్రో యూఎస్బీ పోర్టు,

- హెచ్‌డిఎమ్ఐ పోర్టు,

మైక్రోఎస్‌డీ కార్ట్ సౌలభ్యతతో టాబ్లెట్ ఎక్స్‌టర్నల్ మెమరీని పొడిగించుకోవచ్చు. బ్యాటరీ పనితీరు అంత ఆశాజనకంగా ఉండదు. ధర అంచనా రూ.30,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot