ఆర్కుట్ సేవలను నిలిపివేయనున్న గూగుల్

Posted By:

ఆర్కుట్ సేవలను నిలిపివేయనున్న గూగుల్

తమ మొట్టమొదటి సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఆర్కుట్ (Orkut) సేవలను 2014 సెప్టంబర్ 30 నుంచి నిలిపివేయనున్నట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నేటినుంచి కొత్త ఆర్కుట్ అకౌంట్ తెరవటం సాధ్యంకాదని కంపెనీ తెలిపింది. ఇదే క్రమంలో యూట్యూబ్, బ్లాగర్ ఇంకా గూగుల్ + సర్వీసులు పై మరింత దృష్టిసారించనున్నట్లు గూగుల్ వెల్లడించింది.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆర్కుట్ సేవలను గూగుల్ 2004లో ఆరంభంలో ప్రారంభించింది. అదే సంవత్సరంలో ప్రారంభించబడిన ఫేస్‌బుక్ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1.28 బిలియన్ యూజర్లను సొంతం చేసుకుని నెం.1 సోషల్  నెట్‌వర్క్‌గా అవతరించింది. ఆర్కుట్‌కు బ్రెజిల్‌లో ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేది. ఇప్పుడు ఈ ఘనతను కాస్తా ఫేస్‌బుక్‌ను సొంతం చేసుకుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot