సూపర్ కూల్ ఆండ్రాయిడ్ ఆధారితంగా ‘ డెల్ స్ట్రీక్ 7 ’..!!

అయితే కొత్త ఆపరేటింగ్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న సరికొత్త ‘డెల్ స్ట్రీక్ 7’ విడుదల తేది ఇంకా ఖరారు కాలేదు. ఈ టాబ్లెట్ పీసీలోని ఫీచర్లను పరిశీలిస్తే, 5 అంగుళాల స్క్రీన్ మల్టీ టచ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తుంది. స్ర్ర్కీన్‌కు రక్షణ కవచాల్లా ఏర్పాటు చేసిన కార్నింగ్, గొరిల్లా గ్లాసులు డిస్‌ప్లే పై మచ్చులు పడకుండా చూస్తాయి.
పొందుపరిచిన వై - ఫై, బ్లూటూత్, జీపీఎస్ వ్యంటి వ్యవస్థలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి. 16జీబీ స్టోరేజి వ్యవస్థ, 5 మెగా పిక్సల్ లెడ్ ఫ్లాష్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరాలు నాణ్యమైన విజువల్ అనుభూతిని వినియోగదారునికి అందిస్తాయి. పొందుపరిచిన హెడీఎమ్ఐ వ్యవస్థ ద్వారా టాబ్లెట్ పీసీని హెచ్‌డీ టీవికి అనుసుంధానం చేసుకోవచ్చు. మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ కొత్త వర్షన్ ధర రూ.26000 ఉండోచ్చట.


Click it and Unblock the Notifications