చవక టాబ్లెట్ ‘ఆకాష్’ తయారీ హైదరాబాద్‌లోనే..!!

Posted By: Super

చవక టాబ్లెట్ ‘ఆకాష్’ తయారీ హైదరాబాద్‌లోనే..!!

ప్రపంచంలోనే అత్యంత చౌక్ (రూ.2276) టాబ్లెట్‌గా వార్తలకెక్కిన ‘ఆకాష్’ టాబ్లెట్ పీసీ మన రాష్ట్రంలోనే తయారుకావటం గమనర్హం. హైదరాబాద్ శివారులోని మేడ్చల్‌లో ఈ టాబ్లెట్ పరికరాలను తయారు చేస్తున్నారు.

డేటావిండ్ కంపెనీ ఆధ్వర్యంలో క్వాడ్ (క్వాలిటీ అండర్ ఏబుల్ డైనమిక్స్) ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ సంస్థ ఈ గ్యాడ్జెట్లను తయారు చేస్తుంది. రెండెకరాల సువిశాలమైన కంపెనీ క్యాంపస్‌లో టాబ్లెట్ల తయారీ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రాజెక్టులో భాగంగా 1000 మంది పని చేస్తున్నారు. వీరిలో 65 మంది ఇంజనీర్లు, మిగిలిన వారు ఐఐటీలో ప్రావిణ్యం సంపాదించారు.

చైనా, ఆగ్నేయ ఆసియా దేశాల నుంచి దిగమతి చేసుకున్న విడి భాగాలతో ఆకాశ్‌ను అసెంబుల్ చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 700 ట్యాబ్లెట్లు తయారవుతున్నాయి. ఈ సంఖ్యను 1,500లకు పెంచే యోచనలో ప్రయత్నాలు సాగుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot