త్వరలో.. ప్రపంచమంతా ఉచిత ఇంటర్నెట్!!

Written By:

యూవత్ భూమండలానికి ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ ను అందించే క్రమంలో అమెరికాకు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మీడియా డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఎండీఐఎఫ్) ‘అవుటర్‌నెట్' పేరుతో సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ వాస్తవరూపం దాల్చినట్లయితే అందరికీ కొన్ని పరిమితులతో కూడిన ఉచిత ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

త్వరలో.. ప్రపంచమంతా ఉచిత ఇంటర్నెట్!!

ఈ ప్రతిష్టాత్మక అవుటర్‌నెట్ ప్రాజెక్టులో భాగంగా చిన్నపాటి ఉపగ్రహాలను వందల సంఖ్యలో అంతరిక్షంలో ఏర్పాటు చేస్తారు. ఉప్రగహాలన్నింటిని భూమి పై ఏర్పాటు చేసే ప్రత్యేకమైన  నెట్‌వర్క్‌లకు అనుసంధానిస్తారు. తద్వారా భూమి పై ఉన్న అన్ని ప్రాంతాలకు ఇంటర్నెట్ సిగ్నల్స్ అందాతాయి. ఈ ప్రాజెక్టు అమలులోకి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ సేవలను పొందగలగుతారు

ఈ అవుటర్ నెట్ ప్రాజెక్టును ఎండీఐఎఫ్ గతేడాడి డిసెంబరులో ప్రారభించింది. ఈ ప్రాజెక్టుకు ఏ విధమైన అడ్డంకులు లేకపోయినట్లయితే 2015 జూన్ నాటికి పూర్తియ్యే అవకాశాలు ఉన్నాయని సంస్థ చెబుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎండీఐఎఫ్ సంస్థ నిధులను సేకరిస్తోందట.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting