‘ప్యాకర్డ్ బెల్ లిబర్టీ టాబ్లెట్ G100 760’తో అంతరాయాన్ని మరిచిపోండి..!!

Posted By: Staff

‘ప్యాకర్డ్ బెల్ లిబర్టీ టాబ్లెట్ G100 760’తో అంతరాయాన్ని మరిచిపోండి..!!


కాలంతో పరుగులెట్టే టెక్ యుగంలో ప్రతి నిమిషం విలువైనదే.., మన్నికైన ఫీచర్లతో పాటు అంతరాయంలేని బ్యాటరీ వ్యవస్థను వినియోగదారుడికి అందిస్తూ ప్రముఖ గ్యాడ్జెట్ తయారీదారు ‘ప్యాకర్డ్ బెల్’, లిబర్టీ ట్యాబ్ G100 టాబ్లెట్ పీసీని మార్కెట్లో విడుదల చేసింది.

శ్యామ్‌సంగ్ గెలక్సీ ట్యాబ్ 10.1 (545 గ్రాములు), ఆపిల్ ఐప్యాడ్ 2 (613 గ్రాముల) బరువుతో పోలిస్తే లిబర్టీ ట్యాబ్ G100 760 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ దిగ్గజ బ్రాండ్లకు ధీటుగా డిజైన్ చేయబడ్డ ‘ట్యాబ్ G100’ గ్లోసీ రెడ్‌వైన్, రాయల్ బ్లాక్, డైనమిక్ వైట్ రంగుల్లో లభ్యమవుతుంది.

క్లుప్తంగా ఫీచర్లు:

- ఆండ్రాయిడ్ హనీకూంబ్ 3.0 ఆపరేటింగ్ వ్యవస్థను టాబ్లెట్‌లో లోడ్ చేశారు.
- 1280x800 పిక్సల్ రిసల్యూషన్ గల 10.1 అంగుళాల డిస్‌ప్లే, హై డెఫినిషన్ మరియు టచ్ స్క్రీన్ ఎల్‌సీడీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
- శక్తివంతమైన టెగ్రా 2 డ్యూయల్ కోర్ ప్రొసెసర్ సమర్ధవంతమైన పనితీరు కలిగి ఉంటుంది.
- వినసొంపైన మ్యూజిక్‌ను ఆస్వాదించేందుకు ‘డాల్బీ మొబైల్ సౌండ్’ ఫీచర్‌ను టాబ్లెట్‌లో ప్రవేశపెట్టారు.
- టాబ్లెట్‌లో పొందుపరిచిన 5 మెగా పిక్సల్ రేర్, 2 మోగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలు వీడియో కాలింగ్, వీడియో కాన్ఫిరెన్సింగ్ తదితరల అంశాలకు ఉపయుక్తంగా నిలుస్తాయి.
- హై డెఫినిషన్ నాణ్యతతో విడియోలను చిత్రీకరించుకోవచ్చు.
- 6520 mAh పాలిమర్ బ్యాటరీ వ్యవస్థ, 10 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
- ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న ‘లిబర్టీ ట్యాబ్ G100 760’ 16 జీబీ వర్షన్ ధర రూ.27,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting