జపాన్ మార్కెట్లో పానాసానిక్ బీ11..!

Posted By: Prashanth

జపాన్ మార్కెట్లో పానాసానిక్ బీ11..!

 

జపాన్ మార్కెట్ రోజుకో టెక్నాలజీ ఆవిష్కరణతో హీటెక్కుతోంది. ఇటీవలే సోనీ తన ఎక్స్‌పీరియా మోడల్స్‌ను ప్రవేశపెట్టగా, తాజాగా పానాసానిక్ శక్తివంతమైన ఫీచర్లతో నిండిన నోట్ బీ11 ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరించింది. పానాసానిక్ బీ11 ల్యాప్‌టాప్ మెరుగైన ప్రాసెసర్‌తో వస్తుంది. నిక్షిప్తం చేసిన కోర్ ఐ7-3613క్యూఎమ్ చిప్‌సెట్ వేగవంతమైన పనితీరును అందిస్తుంది.

ల్యాపీ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్లే:

15 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),

750జీబి హార్డ్‌డ్రైవ్,

256జీబీ ఎస్ఎస్‌డి డ్రైవ్.

పొందురిచిన 15 అంగుళాల వెడల్పాటి స్ర్కీన్ ఉత్తమమైన వీక్షణను అందిస్తుంది. మల్టీమీడియా అంశాలను ఈ ల్యాపీ ద్వారా థ్రిల్లింగ్ అనుభూతులతో వీక్షించవచ్చు. బీ10 సిరీస్‌కు ఉపాహారంగా వస్తున్న నోట్ బీ11 సమర్ధవంతమైన కంప్యూటింగ్ వ్యవస్థను ఒదిగి ఉంది. ల్యాపీలో పొందుపరిరచిన 16జీబి ర్యామ్ స్టోరేజ్ సామర్ధ్యాన్ని పటిష్టితం చేస్తుంది. మే18న అధికారింకంగా లాంచ్ కానున్న ఈ ల్యాపీ ఇతర ఫీచర్లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ధర అంచనా రూ.1,50,000.

వినియోగదారులకు ‘సోనీ ఎక్స్‌‌పీరియా యూ’ ఫీచర్లు:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ సోనీ ‘ఎక్స్‌పీరియా ఎస్’ పేరుతో హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గ్యాడ్జెట్ ప్రియుల నుంచి విశేష ఆదరణను చొరగుంటున్న ఈ హ్యాండ్‌సెట్ బ్రాండ్ విలువను మరింత పెంచింది. ఈ క్రమంలో సోనీ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా యూ’ను లెట్స్‌బుయ్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ రిటైలర్ సంస్థలు రూ.17399, రూ.16,499 ధరలకు ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా బార్సిలోనాలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఆవిష్కరించారు. ఏప్రిల్ నాటికి డివైజ్‌ను భారత్‌లో అందుబాటులోకి తెస్తామని సోనీ వర్గాలు ప్రకటించాయి.

‘సోనీ ఎక్స్‌‌పీరియా యూ’ ముఖ్య ఫీచర్లు:

3.5 అంగుళాల స్ర్కాచ్ ప్రూఫ్ టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలోనే ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌ వోఎస్‌ను అప్‌డేట్ చేసుకునే సౌలభ్యత),

512ఎంబీ ర్యామ్,

డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ఎస్‌టీఈ యూ8500 ప్రాసెసర్,

5 మెగా పిక్సల్ కెమెరా (16xడిజిటల్ జూమ్, ఎల్ఈడి ఫ్లాష్, ఆటోఫోకస్),

వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

వై-ఫై కనెక్టువిటీ,

బ్లూటూత్ వర్షన్ 2.1,

బ్యాటరీ టాక్‌టైమ్ 6 గంటల 36 నిమిషాలు, స్టాండ్‌బై 472 గంటలు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot