‘ప్యానాసానిక్’ టఫ్‌బుక్ ల్యాపీలు..!!

Posted By: Staff

‘ప్యానాసానిక్’ టఫ్‌బుక్ ల్యాపీలు..!!


‘‘అత్యంత బలోపేతమైన టెక్ వ్యవస్థతో ప్రముఖ సాంకేతిక పరికరాల బ్రాండ్ ‘ప్యానాసానిక్’ టఫ్‌బుక్ ల్యాప్‌టాప్ పరికరాలను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ల్యాపీలలోని కీప్యాడ్, డిస్‌ప్లే, హార్డ్ డిస్క్ వంటి భాగాలను ధృడమైన వ్యవస్ధతో పటిష్టపరిచారు. ప్రమాదవ శాత్తూ కిందపడటం, విద్యుత్ షాక్, వైబ్రేషన్ ఇలా యాధృచ్చికంగా సంభవించే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఈ ల్యాపీలు బయటపడగలవు. టఫ్‌బుక్ CF-53, టఫ్‌బుక్ S10, టఫ్‌బుక్ CF-C1 మార్క్ 2 మోడళ్లలో విడుదల కాబోతున్న ఈ గ్యాడ్జెట్లు తమ బ్రాండ్ ఉనికిని చాటుతాయని ప్యానాసానిక్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.’’

క్లుప్తంగా టఫ్ బుక్ CF-53 ఫీచర్లు:

- స్పెషల్ డ్రెయినేజి వ్యవస్థను CF-53లో పొందుపరిచారు. కీ బోర్డుపై రక్షణ కవచంలా 170ml గ్లాస్ కవర్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్లాసును ఏర్పాటు చేయ్యటం వల్ల దుమ్ము, ధూళి వంటి పదర్థాలు కీ బోర్డులోకి ప్రవేశించేందుకు అవకాశం ఉండదు.
- 76 సెంటీమీటర్ల పరిమాణం కలిగి ఉండే ఈ పరికరం 100కిలో ఒత్తిడిని తట్టుకోగలదు.
- ల్యాపీలో పొందుపరిచిన షాక్‌ అబ్‌సార్బింగ్ ప్యాడ్లు విద్యుత్ షాక్, వైబ్రేషన్ వంటి అపాయాలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.
- హై‌టెక్ సాంకేతిక వ్యవస్ధతో రూపొందించబడిన ఈ ల్యాపీ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 71,955 ఉండోచ్చని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

క్లుప్తంగా టఫ్ బుక్ S10 ఫీచర్లు:

- టఫ్‌బుక్ S9కు ధీటుగా రూపుదిద్దుకున్న S10 మన్నికైన పని వ్యవస్థను కలిగి ఉంటుంది.
- కేవలం 1.3 కిలో గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ ల్యాపీ సమర్ధవంతమైన పనితీరును నిర్వహిస్తుంది.
- 100కిలో ఒత్తిడిని తట్టుకోగల ఈ ల్యాపీ, 12.5 గంటల పటిష్ట బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
- హై‌టెక్ సాంకేతిక వ్యవస్ధతో రూపొందించబడిన ఈ ల్యాపీ ధర భారతీయ మార్కెట్లో రూ. 110,250 ఉండోచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

టఫ్ బుక్ CF-C1 మార్క్ 2 ఫీచర్లు:

- విండోస్ 7 ప్రోఫెషనల్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగ పని చేసే CF-C1 మోడల్ ఇంటెల్ కోర్ i5-2520M ప్రొసెసింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
- 802.11a/b/g/n వై- ఫై, బ్లూటూత్ v2.1, ఇడీఆర్ సౌలభ్యతలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి.
- కేవలం 1.47 కిలో గ్రాముల బరువు ఉండే ఈ ల్యాపీ 320 జీబీ హార్డ్‌డిస్క్ సామర్ధ్యం, 2జీబీ ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వంటి విశిష్ట వ్యవస్థను కలిగి ఉంటుంది.
- మన్నికైన బ్యాటరీ వ్యవస్థ 12 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
- 100కిలోల ఒత్తిడిని తట్టుకోగల ఈ ల్యాపీలో స్పెషల్ డ్రెయినేజి వ్యవస్థను ఏర్పాటు చేశారు.
- హై టెక్ సాంకేతిక వ్యవస్ధతో రూపొందించబడిన ఈ ల్యాపీ ధర భారతీయ మార్కెట్లో రూ. 125,000 ఉండోచ్చని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot