టార్గెట్ జపాన్..వ్యూహరచన సిద్ధం!

న్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ పానాసానిక్, జే10 సిరీస్ నుంచి పలు వేరియంట్‌లలో నెట్‌బుక్‌లను డిజైన్ చేసింది. ఈ సరికొత్త కంప్యూటింగ్ గ్యాడ్జెట్లు జపాన్ మార్కెట్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పానాసానిక్ మునుపటి మోడల్ జే9తో పోలిస్తే జే10 డివైజ్‌లు సొగసరి ఇంకా క్లాసికల్‌గా రూపొందించబడ్డాయి.
ఫీచర్లు:
10 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్) ,
కోర్ ఐ3,ఐ5,ఐ7 వేరియంట్ లలో ప్రాసెసర్లు (ఎంపికను బట్టి),
ఇంటెల్ చిప్‌సెట్,
ర్యామ్ (4జీబి, 8జీబి),
1టాబ్ హార్డ్‌డ్రైవ్,
256జీబి ఎస్ఎస్‌డి,
320జీబి హెచ్‌డిడి,
ఎస్డీ కార్డ్ రీడర్,
వై-ఫై,
బ్లూటూత్,
యూఎస్బీ కనెక్టువిటీ,
ఇన్‌బుల్ట్ స్పీకర్స్,
స్లాండర్డ్ బ్యాటరీ (బ్యాకప్ 12.5 గంటలు),
ప్రారంభ మోడల్ ధర రూ.75,000, హై-ఎండ్ మోడల్ ధర రూ.1,65,000.
మూడు వేరియంట్‌లలో ఈ నెట్‌బుక్‌లు లభ్యం కానున్నాయి. వీటిలో బేస్ మోడల్ కోర్ ఐ3-2350ఎమ్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరో మోడల్‌లో ఐ5-2450ఎమ్ సామర్ధ్యం కలిగిన ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేశారు. చివరి హై ఎండ్ మోడల్ కోర్ ఐ7-2640ఎమ్ సామర్ధ్యం గల శక్తివంతమైన ప్రాసెసర్‌ను ఒదిగి ఉంటుంది. పటిష్టమైన స్టోరేజ్ వ్యవస్థ, పది అంగుళాల ఉత్తమ క్వాలిటీ స్ర్కీన్, మన్నికైన బ్యాటరీ బ్యాకప్, ఆప్షనల్ బ్లూటూత్ కనెక్టువిటీ, వై-ఫై తదితర అంశాలు యూజర్‌కు క్వాలిటీ కంప్యూటింగ్‌ను చేరువచేస్తాయి. ఈ డివైజ్ ఇండియాలో విడుదలకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








