పానాసానిక్ నుంచి కొత్త కంప్యూటింగ్ ఉత్పత్తులు

Posted By: Staff

 పానాసానిక్ నుంచి కొత్త కంప్యూటింగ్ ఉత్పత్తులు

 

ప్రముఖ బ్రాండ్ పానాసానిక్ టఫ్‌బుక్ ఇంకా ల్యాప్‌టాప్ శ్రేణుల్లో రెండు సరికొత్త కంప్యూటింగ్ ఉత్పత్తులను ఆవిష్కరించింది. వీటిలో టఫ్‌ప్యాడ్  ఎఫ్‌జడ్- ఏ1 టాబ్లెట్  ఆండ్రాయిడ్ వోఎస్ పై స్పందిస్తుంది. మరో కన్విర్టబల్ అల్ట్రాబుక్ పానాసానిక్  సీఎఫ్-ఏఎక్స్2 విండోస్ 8 ప్రో ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది.

పానాసానిక్  సీఎఫ్-ఏఎక్స్2 విండోస్ 8 ప్రో  అల్ట్రాబుక్:

ఫ్లిప్-ఓవర్ డిజైన్ తరహాలో ఈ గాడ్జెట్ రూపకల్పన ఉంది. గాడ్జెట్‌ను సందర్భాన్ని బట్టి  నోట్‌బుక్ లేదా టాబ్లెట్ మోడ్‌లలో ఉపయోగించుకోవచ్చు. విండోస్ 8 ప్రో పై స్పందిస్తుంది. శక్తవంతమైన బ్యాటరీని  డివైజ్‌లో వినియోగించారు. స్టైల్, డ్యూరబులిటీ వంటి అంశాలు యూజర్‌కు మరింత లబ్ధి చేకూరుస్తాయి. ధర రూ. 1.3లక్షలు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ గాడ్జెట్‌లు అందుబాటులోకి రానున్నాయి.

టఫ్‌ప్యాడ్  ఎఫ్‌జడ్- ఏ1 టాబ్లెట్ : ఆండ్రాయిడ్ వోఎస్ పై టాబ్లెట్ స్పందిస్తుంది.  ఈ శక్తివంతమైన డివైజ్‌ను కఠినమైన వాతావరణాల్లోనూ వినియోగించుకోచ్చు. జటిలమైన వాతావరణాల్లో పనిచేసే వారి కోసం ఈ డివైజ్‌ను రూపొందించినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ధర రూ.75,000.

మరిన్ని పానాసానిక్ టఫ్‌బుక్‌ల స్పెసిఫికేషన్‌లు:

టఫ్ బుక్ CF-53 ఫీచర్లు:

- స్పెషల్ డ్రెయినేజి వ్యవస్థను CF-53లో పొందుపరిచారు. కీ బోర్డుపై రక్షణ కవచంలా 170ml గ్లాస్ కవర్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్లాసును ఏర్పాటు చేయ్యటం వల్ల దుమ్ము, ధూళి వంటి పదర్థాలు కీ బోర్డులోకి ప్రవేశించేందుకు అవకాశం ఉండదు.

- 76 సెంటీమీటర్ల పరిమాణం కలిగి ఉండే ఈ పరికరం 100కిలో ఒత్తిడిని తట్టుకోగలదు.

- ల్యాపీలో పొందుపరిచిన షాక్‌ అబ్‌సార్బింగ్ ప్యాడ్లు విద్యుత్ షాక్, వైబ్రేషన్ వంటి అపాయాలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.

క్లుప్తంగా టఫ్ బుక్ S10 ఫీచర్లు:

- టఫ్‌బుక్ S9కు ధీటుగా రూపుదిద్దుకున్న S10 మన్నికైన పని వ్యవస్థను కలిగి ఉంటుంది.

- కేవలం 1.3 కిలో గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ ల్యాపీ సమర్ధవంతమైన పనితీరును నిర్వహిస్తుంది.

- 100కిలో ఒత్తిడిని తట్టుకోగల ఈ ల్యాపీ, 12.5 గంటల పటిష్ట బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

టఫ్ బుక్ CF-C1 మార్క్ 2 ఫీచర్లు:

- విండోస్ 7 ప్రోఫెషనల్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగ పని చేసే CF-C1 మోడల్ ఇంటెల్ కోర్ i5-2520M ప్రొసెసింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

- 802.11a/b/g/n వై- ఫై, బ్లూటూత్ v2.1, ఇడీఆర్ సౌలభ్యతలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి.

- కేవలం 1.47 కిలో గ్రాముల బరువు ఉండే ఈ ల్యాపీ 320 జీబీ హార్డ్‌డిస్క్ సామర్ధ్యం, 2జీబీ ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వంటి విశిష్ట వ్యవస్థను కలిగి ఉంటుంది.

- మన్నికైన బ్యాటరీ వ్యవస్థ 12 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

- 100కిలోల ఒత్తిడిని తట్టుకోగల ఈ ల్యాపీలో స్పెషల్ డ్రెయినేజి వ్యవస్థను ఏర్పాటు చేశారు.

అందాలను సొమ్ము చేసుకుంటున్న టాప్-5 బాలీవుడ్ హిరోయిన్స్!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot