మైక్రో సాఫ్ట్ విండోస్ ఆధారిత ఇండస్ట్ర్రియల్ టాబ్లెట్..!!

Posted By: Super

మైక్రో సాఫ్ట్ విండోస్ ఆధారిత ఇండస్ట్ర్రియల్ టాబ్లెట్..!!

ఆపరేషన్ ‘ప్యానాసానిక్’లో మైక్రోసాఫ్ట్ విండోస్ హస్తముందా..?, ఎవరిని టార్గెట్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ వ్యూహరచన చేసింది..?, ఈ ఆపరేషన్ ఆటోమొబైల్ మరియు ఇండస్ట్రియల్ రంగం పై ప్రభావం చూపనుందా..?.

‘మైక్రోసాఫ్ట్ విండోస్ 7’ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ‘CF-D1’ ఇండస్ట్రియల్ టాబ్లెట్ పీసీని త్వరలో మార్కెట్లో విడుదల చేయునున్నారు. ‘ప్యానసానిక్’ ఈ గ్యాడ్జెట్ ను ప్రమోట్ చేయునుంది. ఆటోమొబైల్ మరియు ఇంజనీరంగ్ ప్రొఫెషనల్స్ పనులకు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లను ఈ టఫ్ బుక్ పరికరంలో పొందుపరిచారు. ప్రుడక్ట్ ఫీచర్లను పరిశీలిస్తే 13.3 అంగుళాల డిస్ ప్లే హైడెఫినిషన్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. టచ్ స్క్రీన్ సౌలభ్యతతో పనిచేసే ఈ గ్యాడ్జెట్ ను చేతి వేలు, లేదా పెన్ తో ఆపరేట్ చేయవచ్చు. ఇంటెల్ కోర్ i5 ప్రాసెసింగ్ వ్యవస్థను పరికరంలో పొందుపరిచారు. ఏర్పాటు చేసిన పటిష్ట బ్యాటరీ వ్యవస్థ 9 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. Intel Centrino వ్యవస్థను ఈ గ్యాడ్జెట్ సపోర్టు చేస్తుంది.

అమర్చని బ్లూటూత్ 2.1, జీజీఎస్, 3జీ వ్యవస్థలు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి. ఏర్పాటు చేసిన 1.3 మెగా పిక్సల్ కెమెరా వీడియో కాన్ఫిరెన్సింగ్ కు దోహదపడుతుంది. ఇండస్ట్ర్రీయల్ వాడకానికి మైక్రో సాఫ్ట్ ఆధారిత ‘ప్యానాసానిక్ టఫ్ బుక్ CF-D1’సరైన ఎంపికని విశ్లేషకులు మార్కులు వేస్తున్నారు. అతిత్వరలో విడుదల కాబోతున్న ఈ గ్యాడ్జెట్ కు సంబంధించి ఇతర ధర విషయాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot