నీటిలో సైతం చెక్కు చెదరదు!!!

Posted By: Prashanth

నీటిలో సైతం చెక్కు చెదరదు!!!

 

ప్రపంచవ్యాప్తంగా టాబ్లెట్ కంప్యూటర్ల వాడకం వ్యాప్తి చెందటంతో అనేక సంస్థలు వీటి తయారీ పై మక్కువ కనబరుస్తున్నాయి. ప్రముఖ ఆడియో గ్యాడ్జెట్ల తయారీదారు ప్యానసానిక్ (Panasonic) తాజాగా టాబ్లెట్ పీసీల పరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసింది. వేడి, చలి, చమ్మ ఇతర ప్రతికూల వాతవరణాల్లో ఏ విధమైన అంతరాయం లేకుండా పని చేసే విధంగా ప్యానసానిక్ ‘టఫ్ ప్యాడ్ A1’ పేరుతో శక్తివంతమైన టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది. ప్రయాణ సందర్భాల్లో సౌకర్యవంతమైన కంప్యూటింగ్ కోరుకునే వారికి ఈ టాబ్లెట్ కంప్యూటర్ ఉపయుక్తంగా నిలుస్తుంది.

క్లుప్తంగా ఫీచర్లు:

చుట్టు కొలతలు 267 x 211 x 17 mm, బరువు 966 గ్రాములు, వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ మరియు షాక్ ప్రూఫ్, 10.1 అంగుళాల డిస్‌ప్లే, మల్టీ‌టచ్ సపోర్ట్, పిక్సిల్ రిసల్యూషన్ 768 x 1024, పటిష్ట 4590mAh బ్యాటరీ వ్యవస్థ, డ్యూయల్ కోర్ 1200 MHz మార్వెల్ ప్రాసెసర్, సిస్టం మెమరీ 1024MB, ఇన్‌బుల్ట్ స్టోరేజి సామర్ద్యం 16, 384 MB, ఎక్సటర్నల్ మెమరీ కార్డ్ సౌలభ్యతతో జీబీని 32కు పెంచుకోవచ్చు, ఆండ్రాయిడ్ వర్సన్ 3.2 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమరా, బ్లూటూత్ 2.1, వై-ఫై కనెక్టువిటీ, యూఎస్బీ కనెక్టర్..

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot