పాన్ డిజిటల్ సూపర్ నోవా ఆండ్రాయిడ్ మీడియా టాబ్లెట్..!!

Posted By: Staff

పాన్ డిజిటల్ సూపర్ నోవా ఆండ్రాయిడ్ మీడియా టాబ్లెట్..!!

ఆండ్రాయిడ్ రహస్యాన్ని తెలసుకునేందుకు మీరు సిద్ధమేనా..?, ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ అభిమానుల సంఖ్య కోట్ల్లలోనే ఉంటుంది..? ‘ఫ్రెండ్లీ యూజర్’గా వినియోగాదారులకు విశిష్ట సేవలందిస్తున్న ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ మరింత చవకలో లభ్యం కానుంది...

‘పాన్ డిజిటల్ సూపర్ నోవా ఆండ్రాయిడ్ మీడియా టాబ్లెట్’అతి త్వరలో వినియోగదారులకు చేరువకానుంది. అత్యాధునిక ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లతో రూపుదిద్దుకున్న ఆండ్రాయిడ్ గ్యాడ్జెట్ ను కేవలం రూ.10,000లకే సొంతం చేసుకోవచ్చు. నవంబర్ లో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్ పరికరం పై ఇప్పటికే అంచనాలు ఊపందుకున్నాయి.’

క్లుప్తంగా ఆండ్రాయిడ్ మీడియా టాబ్లెట్ ఫీచర్లు :

- ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ వ్యవస్థను టాబ్లెట్ లో లోడ్ చేశారు.

- శక్తివంతమైన 1 GHz ప్రాసెసింగ్ వ్యవస్థ వేగవంతమైన పనితీరును అందిస్తుంది.

- 8 అంగుళాల టాబ్లెట్ స్క్రీన్ మల్టీ టచ్ ఎల్ సీడీ వ్యవస్థను కలిగి ఉంటుంది.

-2-axis యాక్సిలరోమిటర్ అప్లికేషన్ ను టాబ్లెట్లో పొందుపరిచారు.

- అత్యాధునిక కెమెరా వ్యవస్థలను గ్యాడ్జెట్లో ఏర్పాటు చేశారు. నాణ్యమైన వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.

- MP3, WAV, MPEG4,AAC తదితర ఫార్మాట్లను టాబ్లెట్లో ఏర్పాటు చేసిన వీడియో, ఆడియో ప్లేయర్లు సపోర్టు చేస్తాయి.

- టాబ్లెట్లో పొందుపరిచిన పటిష్ట లయోన్ బ్యాటరీ వ్యవస్థ 6 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

- టాబ్లెట్లో అమర్చని వై -ఫై, బ్లూటూత్ అంశాలు డేటాను మరింత వేగవంతంగా ట్రాన్స్ ఫర్ చేస్తాయి.

- ఆడోబ్ ఫ్లాష్ 10.3, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్, యూ ప్లేయర్ వంటి సోషల్ నెటవర్కింగ్ అంశాలను ముందుగానే టాబ్లెట్లో లోడ్ చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot