దమ్మున్న చిన్నది.. దుమ్ము దులిపేందుకు రె‘ఢీ’!!

Posted By: Prashanth

దమ్మున్న చిన్నది.. దుమ్ము దులిపేందుకు రె‘ఢీ’!!

 

ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయరీ సంస్ధ పాంటెక్ పటిష్ట వాటర్ ప్రూఫ్ వ్యవస్థతో టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేసింది. ఈ పీసీ నీటిలో పడినప్పటికి చెక్కు చెదరకుండా పనిచేస్తుంది. మన్నికైన అత్యాధునిక ఫీచర్లను గ్యాడ్జెట్‌‌లో లోడ్ చేశారు, వాటి వివరాలు క్లుప్తంగా:

టాబ్లెట్ డిస్‌ప్లే 8 అంగుళాల పరిమాణాన్ని కలిగి టచ్ అధారితంగా పని చేస్తుంది. శక్తివంతమైన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌ను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. 4జీ నెట్‌వర్క్‌ను టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ సామర్ధ్యం 1జీబి, ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలు కలిగిన 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థలు ఏర్పాటు. హెచ్‌డీఎమ్‌ఐ అవుట్ సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ సపోర్ట్. ఇండియన్ మార్కెట్లో ‘పాంటెక్ ఎలిమెంట్ IP57’ ధర రూ.25,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot