పాంటెల్ కొత్త టాబ్లెట్.. 8 అంగుళాల స్ర్కీన్... వాయిస్ కాలింగ్ ఫీచర్!

Posted By: Prashanth

పాంటెల్ కొత్త టాబ్లెట్.. 8 అంగుళాల స్ర్కీన్... వాయిస్ కాలింగ్ ఫీచర్!

 

పాంటెల్ టెక్నాలజీ తన టాబ్లెట్ పీసీల లైనప్‌ను మరింత పటిష్టం చేస్తూ ‘డబ్ల్యూఎస్802సీ-2జీ’ శ్రేణిలో సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.8,299. వాయిస్ కాలింగ్ ప్రత్యేకతతో రూపుదిద్దుకున్న ఈ డివైజ్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. పీసీ కొనుగోలు పై బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌ను యూజర్ పొందవచ్చు. ఆఫర్‌లో భాగంగా 4జీబి డాటాను రెండు నెలల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. డివైజ్ కొనుగోలు పై రూ.1499విలువ చేసే కీబోర్డ్‌ను పాంటెల్ ఆఫర్ చేస్తోంది.

స్పెసిఫికేషన్‌లు:

8 అంగుళాల కెపాసిటివ్ డిస్‌ప్లే,

సిమ్‌కార్డ్ స్లాట్,

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

3జీ డాంగిల్ వయా యూఎస్బీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

పోటిని ఎదుర్కొనున్న‘మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ టాక్’ ఫీచర్లు:

7 అంగుళాల కెపాసిటివ్ టీఎఫ్టీ ఎల్‌సీడీ మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్800× 480పిక్సల్స్), 1గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 512ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ, 0.3 మెగాపిక్సల్ వీజీఏ కెమెరా, యూఎస్బీ వీ2.0, మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, గ్రావిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ(టాక్‌టైమ్ 5 గంటలు, స్టాండ్‌బై టైమ్ 5 గంటలు), ధర రూ.7,249.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot