పాంటెల్ vs సెల్‌కాన్ (చవక ధర టాబ్లట్ యుద్ధం)

By Super
|
 Pantel Penta T-Pad WS703C vs Celkon Celtab CT2: Which Budget Tablet with Voice Call Support Should You Pick?


ఇండియన్ టాబ్లెట్ మార్కెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీలతో మారుమోగుతోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లు టాబ్లెట్‌ల తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. ఈ క్రమంలో దేశవాళీ బ్రాండ్‌లైన సెల్‌కాన్, పాంటెల్‌లు మొబైల్ కాలింగ్ సౌలభ్యతతో కూడిన ఆండ్రాయిడ్ ఐసీఎస్ టాబ్లెట్‌లను విపణిలో ప్రవేశపెట్టాయి. ఆండ్రాయిడ్ ఐసీఎస్ అలాగే వాయిస్ కాలింగ్ ఫీచర్లతో కూడిన సెల్‌కాన్ ‘సెల్ టాబ్ సీటీ2’, పాంటెల్ ‘టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ’ టాబ్లెట్‌లు ప్రస్తుత బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీల మార్కెట్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. వీటి స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.....

డిస్‌ప్లే....

పాంటెల్ టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, 3డీ డిస్‌ప్లే,

సెల్‌కాన్ సెల్‌టాబ్ సీటీ2: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్.....

పాంటెల్ టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ: 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

సెల్‌కాన్ సెల్‌టాబ్ సీటీ2: ఆర్మ్ 11 కోర్ ప్రాసెసర్(1గిగాహెడ్జ్),

ఆపరేటింగ్ సిస్టం....

పాంటెల్ టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్,

సెల్‌కాన్ సెల్‌టాబ్ సీటీ2: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్,

కెమెరా....

పాంటెల్ టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా,

సెల్‌కాన్ సెల్‌టాబ్ సీటీ2: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది,

స్టోరేజ్....

పాంటెల్ టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

సెల్‌కాన్ సెల్‌టాబ్ సీటీ2: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ....

పాంటెల్ టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ: సిమ్ కార్డ్‌స్లాట్ (మొబైల్ కాలింగ్ నిర్వహించుకునేందుకు), వై-ఫై, 3జీ వయా డాంగిల్, మినీ యూఎస్బీ పోర్ట్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

సెల్‌కాన్ సెల్‌టాబ్ సీటీ2: సిమ్ కార్డ్‌స్లాట్ (మొబైల్ కాలింగ్ నిర్వహించుకునేందుకు), వై-ఫై, 3జీ వయా డాంగిల్, మినీ యూఎస్బీ పోర్ట్, బ్లూటూత్,

బ్యాటరీ.....

పాంటెల్ టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ: 3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

సెల్‌కాన్ సెల్‌టాబ్ సీటీ2: 3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర.....

పాంటెల్ టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ: రూ.6,999.

సెల్‌కాన్ సెల్‌టాబ్ సీటీ2: రూ.7,499.

ప్రత్యేకతలు....

పాంటెల్ టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ: 3డి డిస్‌ప్లే, మల్టీటచ్ కెపాసిటివ్ స్ర్కీన్, రేర్ కెమెరా, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం, వేగవంతమైన ప్రాసెసర్, పాంటెల్ టాబ్లెట్ కొనుగోలు పై బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ప్యాకేజీలతో కూడిన డేటా ప్లాన్‌లను అందిస్తోంది.

సెల్‌కాన్ సెల్‌టాబ్ సీటీ2: ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం, బ్లూటూత్ కనెక్టువిటీ, ప్రీలోడెడ్ అప్లికేషన్స్, లైవ్ టీవీ, ఓపెరా మినీ బ్రౌజర్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X