పాంటెల్ కొత్త ట్యాబ్లెట్: వాయిస్ కాలింగ్, జెల్లీబీన్ ఇంకా 3డీ ఫీచర్లతో.....

Posted By:

 పాంటెల్ కొత్త ట్యాబ్లెట్: వాయిస్ కాలింగ్, జెల్లీబీన్ ఇంకా 3డీ ఫీచర్లత
దేశీయంగా ట్యాబ్లెట్ కంప్యూటర్‌లకు
ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో ప్రముఖ దేశవాళీ సంస్థ పాంటెల్ టెక్నాలజీస్.. బీఎస్ఎన్‌ఎల్‌తో జతకట్టి ఆండ్రాయిడ్ జెల్లీబీన్, వాయిస్ కాలింగ్, 3డీ వంటి ప్రత్యేక ఫీచర్లతో కూడిన సరికొత్త ట్యాబ్లెట్‌ను విపణిలో ఆవిష్కరించింది. పేరు పాంటెల్ ‘పెంటా టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్707సీ'. ధర రూ.7,999.

రాబోయే తరానికి కాబోయే కెమెరాలు? (ఫోటో గ్యాలరీ)

ముచ్చటైన ల్యాండ్‌లైన్ ఫోన్‌లు!!!

ప్రధాన స్పెసిఫికేషన్‌లు....

7 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), 3డీ గ్రాఫిక్ సపోర్ట్, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ 400 3డీ యాక్సిలరేటర్ జీపీయూ, ఆండ్రాయిడ్ 4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మినీ యూఎస్బీ పోర్ట్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, సిమ్‌కార్డ్ స్లాట్, ఎడ్జ్ సపోర్ట్, 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఇతర ఫీచర్లు......

ట్యాబ్లెట్‌లో లోడ్ చేసిన జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్ పలు ప్రత్యేక ఫీచర్లను చేరువ చేస్తుంది. పొందుపరిచిన డ్యూయల్ స్ర్కీన్ ఫీచర్‌తో యూజర్ మల్టీ విండో ఆపరేటింగ్ నిర్వహించుకోవచ్చు.

ఉచిత ఆఫర్లు....

3డీ గ్రాఫిక్‌లను సపోర్ట్ చేసే ‘టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్707సీ' కొనుగోలు పై పాంటెల్.. 3డీ కళ్లాద్దాలతో పాటు డాటా కేబుల్ ఇంకా ట్రెండీ పౌచ్‌లను ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు....

యూట్యూబ్, నెక్స్ జీటీవీ, ఫేస్‌బుక్, స్కైప్ వంటి ప్రత్యేక అప్లికేషన్‌లను ‘టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్707సీ'లో లోడ్ చేశారు.

ధర ఇతర అందుబాటు వివరాలు....

ధర రూ.7,999. లింక్ అడ్రస్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot