‘వారధి’ సక్సెస్ అవుతాడా?

Posted By: Staff

‘వారధి’ సక్సెస్ అవుతాడా?

దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కంప్యూటింగ్ పరిజ్ఞానాన్ని మరింత చేరువ చేసే క్రమంలో పాంటెల్ టెక్నాలజీస్ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌ సహకారంతో ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. ‘బీఎస్ఎన్ఎల్ పెంటా టీ-ప్యాడ్ IS701C’ మోడల్‌లో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ధర రూ.4,999. గ్రామిణ ప్రాంతాల్లో ఉత్తమ నెట్‌వర్క్‌గా గుర్తింపుతెచ్చుకున్న బీఎస్ఎన్ఎల్ ఈ పీసీలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వారధిగా వ్యవహరించనుంది.

ఫీచర్లు:

7 అంగుళాల మల్టీటచ్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 512ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై కనెక్టువిటీ, 3జీ యూఎస్బీ డాంగిల్ సపోర్ట్, 0.3మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫ్రీలోడెడ్ అప్లికేషన్స్ (ట్విట్టర్, ఫేస్‌బుక్, స్కైప్, యాంగ్రీ బర్డ్స్), 6 గంటల బ్యాటరీ బ్యాకప్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot