2జీ మొబైల్ కాలింగ్.. 3జీ కంప్యూటింగ్.. 3డి ఎఫెక్ట్స్ (ఒకే టాబ్లెట్‌లో.. తక్కువ ధరలో)

Posted By: Staff

2జీ మొబైల్ కాలింగ్.. 3జీ కంప్యూటింగ్.. 3డి ఎఫెక్ట్స్ (ఒకే టాబ్లెట్‌లో.. తక్కువ ధరలో)

 

 

నోయిడా ఆధారితంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ టక్నాలజీ సంస్థ పాంటెల్ టెక్నాలజీస్ ప్రయివేటు లిమిటెడ్ (పీటీపీఎల్), ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో జతకట్టి భారతదేశపు మొట్టమొదటి 2జీ సిమ్ స్లాట్ టాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. పేరు పెంటా టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్703సీ (Penta T-Pad WS703C).ధర రూ.6,999. ఈ గ్యాడ్జెట్ ద్వారా మొబైలింగ్.. కంప్యూటింగ్ అదేవిధంగా 3డీ అనుభూతులను ఏకకాలంలో ఆస్వాదించవచ్చు.

ఫీచర్లు:

7 అంగుళాల 3డి కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా వ్యవస్థ,

వాయిల్ కాలింగ్ ఫీచర్,

టీఎఫ్ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

మన్నికైన బ్యాటరీ,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

512ఎంబీ ర్యామ్,

1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ఇన్‌బుల్ట్ 2జీబి సిమ్‌స్లాట్,

3జీ డాంగిల్ నె కనెక్ట్ చేసుకునే సౌకర్యం,

3డి కోణంలో వీక్షణ.

ఈ టాబ్లెట్ కొనుగోలు పై బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక డేటా ప్లాన్‌లను అందిస్తోంది. రూ.125 ప్లాన్‌లో భాగంగా 4జీబి సామర్ధ్యం కలిగిన 2జీ డేటాను 60 రోజులు పాటు వాడుకోవచ్చు, మరో ప్లాన్ రూ.150లో భాగంగా 2జీబి సామర్ధ్యం కలిగిన 3జీ డేటాను 60 రోజులు పాటు ఆస్వాదించవచ్చు.

Read in English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting